IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2025 (18వ సీజన్) లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం) వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో సొంతగడ్డ పై ఆడటం సన్ రైజర్స్‌కు కలిసొచ్చే అంశంగా మారనుంది. అభిమానుల అంబరాన్ని అంటేలా ‘ఆరెంజ్ ఆర్మీ’ స్టేడియంలో హోరెత్తిస్తోంది.

1742645469111

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడినా హైదరాబాద్ బ్యాటింగ్ దక్కడంతో స్టేడియంలో SRH అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టాస్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, మంచి స్టార్టింగ్ ఇవ్వాలని మా బలమైన బ్యాటింగ్ లైన్ అప్ చూసుకుంటుంది. ఉప్పల్ స్టేడియంలో మా బలాన్ని నిరూపించుకోవాలని చూస్తాం అని అన్నారు.

SRH జట్టులో కొత్త ఆటగాళ్లు

ఈ మ్యాచ్ ద్వారా ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ తొలిసారి SRH తరపున ఆడనున్నారు. గత సీజన్‌లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన వీరు ఈసారి సన్ రైజర్స్ తరఫున తొలి అనుభవాన్ని పొందుతున్నారు. మరోవైపు, రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. అందువల్ల, రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH):

పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.

రాజస్థాన్ రాయల్స్(RR):

రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీశ్ రాణా, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్) జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫరూఖీ.

Related Posts
అందుబాటులోకి సర్వైకల్ క్యాన్సర్ టీకా?
Cervical cancer

సర్వైకల్ క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్- 2025లో చారిత్రక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేషనల్ ఇమ్మునైజేషన్ ప్రోగ్రాం పరిధిలోకి ఈ Read more

మహా శివరాత్రి వేళ అధికారులకు పవన్ కీలక సూచనలు
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

అన్నమయ్య జిల్లా గుండాల కోన అటవీ ప్రాంతంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా శివాలయానికి వెళ్లిన భక్తులపై ఏనుగుల దాడి జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ Read more

హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్

స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల కార్యక్రమంలో పాల్గొని, తన కెరీర్ విషయంతో పాటు భారతదేశంలో హిందీ భాష స్థితిగతులపై వ్యాఖ్యలు చేసి Read more

యథాతథంగానే రెపో రేటు..
rbi announces monetary policy decisions

న్యూఢిల్లీ: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంతో ముగిసిన మూడు రోజుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *