Rain :ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు లో భారీ వర్షాలు

Rain :ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈదురుగాలులు వీచాయి.ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో దంచికొట్టే స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగాఉంది.వర్ష బీభత్సానికి బెంగళూరు వ్యాప్తంగా 30 చెట్లు కూలిపోయాయి. కాక్స్ బజార్ జీవన్‌హళ్లిలో చెట్టు కొమ్మలు విరిగిపడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈస్ట్ పార్క్ మెయిన్ రోడ్ వద్ద రాత్రి 8:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రక్ష అనే బాలిక తన తండ్రి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా, చెట్టు కొమ్మలు విరిగిపడి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.

బెంగళూరులో భారీ వర్షాలు

బెంగళూరులో భారీ వర్షం కురిసింది. గంట పాటు వర్షం ఉధృతంగా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ తర్వాత కూడా అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నగరంలోని ఎంజీ రోడ్, ఇందిరానగర్, ఎలక్ట్రానిక్ సిటీ, జయనగర, హెబ్బాళ, సుల్తాన్ పాళ్య, ఆర్టీ నగర వంటి ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రంగా నమోదైంది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.

తమిళనాడులో వర్షాల ప్రభావం

తమిళనాడులో కూడా ఉపరితల ఆవర్తనం ప్రభావం స్పష్టంగా కనిపించింది. చెన్నై సహా పుదుచ్చేరి, కరైకల్, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుథురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.ఈదురుగాలుల కారణంగా చెట్లు, హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నైలోని మధురవాయల్, అన్నా సలై, టి.నగర్, ప్రాంతాల్లో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.

hyderabad rain

విమానాలను మల్లింపు

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా పడింది. వాతావరణ అనుకూలించకపోవడంతో 20 విమానాలను మళ్లించాల్సి వచ్చింది.ఇండిగో – 10 విమానాలు,ఎయిరిండియా – 4 విమానాలు,ఆకాశ – 2 విమానాలు.మారిషస్, మాలీ, హైదరాబాద్, ముంబై, దుర్గాపూర్, గోవా, పోర్ట్‌బ్లెయిర్, షిర్డీ, తిరుచిరాపల్లి, ఢిల్లీ, విశాఖపట్నం, బగ్డోగ్రా, ఐజ్వాల్ నుంచి రానున్న విమానాలను కోయంబత్తూరు, చెన్నైకి మళ్లించారు.

ప్రభుత్వం అప్రమత్తం

వర్షాల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై మున్సిపల్ అధికారులు పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రజలకు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.వర్షం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.

వాతావరణ పరిస్థితి

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, రాబోయే 24 గంటల్లో మరిన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ, రాహుల్ స్పందన
Political leaders condolenc

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం విశిష్ట నేతను కోల్పోయిందని, ఆయన సేవలను Read more

మందిరం-మసీదు వివాదం: యోగి ఆదిత్యనాథ్
మందిరం-మసీదు వివాదం: యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధర్మ సంసద్ కార్యక్రమంలో పాల్గొనగా, మహాకుంభ మేళా జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అన్న వాదనలను ఖండించారు. దేశంలో అనేక మందిరం-మసీదు Read more

కోహ్లీపై క‌మిన్స్ స్లెడ్జింగ్‌.. వీడియో వైర‌ల్!

ఇటీవ‌ల ముగిసిన బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఇంత‌కుముందు ఎప్పుడూ ఆసీస్‌తో సిరీస్‌లో ర‌న్‌మెషీన్ ఇలా ఫెయిల్ Read more

వెనుకంజ‌లో కాంగ్రెస్‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి..కౌటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ పోగ‌ట్‌
Congress candidate from Julana Vinesh Phogat leaves from a counting center

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *