KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన ఇప్పుడు రైతుల గుండెల్లో గునపం దించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు అక్షరాలా 420 అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ, రైతుభరోసా అంశాలపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం రూ. 2 లక్షలు దాటితే మాఫీ వర్తించదని చెప్పడం ఓ మహా మోసం అని ఆరోపించారు. ‘అబద్ధపు హామీలు ఇచ్చినందుకు మిస్టర్ రాహుల్ గాంధీ, మాఫీ మాంగో తెలంగాణసే’ అంటూ తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

అధికారంలోకి రావడానికి అందరికీ రుణమాఫీ అనే మాట ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక మాత్రం కొందరికే వర్తిస్తుందని మాట మార్చారని మండిపడ్డారు.చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌ ను కాంగ్రెస్ తూట్లు పొడిచిందని ఆరోపించారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా.పెట్టెలో ఓట్లు పడ్డాయ్, జేబులో నోట్లు పడ్డాయ్.ఢిల్లీకి మూటలు ముట్టాయ్.ఇప్పుడు వాగ్దానాలేంటో పట్టించుకోవడం లేదు’ అంటూ కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసిన పాపానికి కాంగ్రెస్ త్వరలోనే ప్రజల కోపాన్ని ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.

Related Posts
ముజిగల్ ఎడ్యుటెక్ మైలురాయి వేడుకలు
Muzigal Edutech milestone celebration

హైదరాబాద్ : సంగీత విద్య కోసం భారతదేశం యొక్క ప్రీమియర్ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా వెలుగొందుతున్న, ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశం అంతటా 100+ అకాడమీ Read more

ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: వెంకయ్యనాయుడు
venkaiah naidu ntr

తెలుగువారి గర్వకారణమైన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలలో మాట్లాడిన Read more

ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
AP High Court has two new j

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు కొత్త అడిషనల్ జడ్జిలను నియమించారు. అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Read more

KTR: ఆ మరణాలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే: కేటీఆర్
KTR 19

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *