10,000 suggestions received from people on budget.. CM Rekha Gupta

Delhi budget : బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల సూచనలు అందాయి: సీఎం రేఖాగుప్తా

Delhi budget : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేఖాగుప్తా పేర్కొన్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్‌ ఢిల్లీ బడ్జెట్‌ విషయంలో ప్రజల నుంచి 10 వేల సూచనలు అందినట్లు రేఖాగుప్తా వెల్లడించారు. ఇందులో మహిళల ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యం వంటివాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దేశరాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల

మెయిల్ ద్వారా 3,303 సూచనలు

బడ్జెట్‌ను సిద్ధం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం నిపుణులతో సహా సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించిందని రేఖా గుప్త తెలిపారు. ప్రజల నుంచి మెయిల్ ద్వారా 3,303 సూచనలు రాగా.. వాట్సప్ ద్వారా 6,982 సూచనలు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందిస్తామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిల్లీని అభివృద్ధి బాటలో నడుపుతుందని పేర్కొన్నారు.

Related Posts
తొక్కిసలాట ఘటనపై స్పందించిన రైల్వే
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.

ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ స్పందించారు. రైల్వే స్టేషన్‌లో 14, 15వ ప్లాట్‌ఫాంల వైపు Read more

అనంత్ నేషనల్ యూనివర్శిటీ 6వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి సుధా మూర్తి
sudhamurthi Ananth National

అహ్మదాబాద్, డిసెంబర్ 2024: అనంత్ నేషనల్ యూనివర్శిటీ 6వ స్నాతకోత్సవాన్ని నిర్వహించింది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ డిజైన్ మరియు అనంత్ Read more

భాషను తక్కువగా అంచనా వేయొద్దు – కమల్ హాసన్
భాషను తక్కువగా అంచనా వేయొద్దు - కమల్ హాసన్

తమిళనాడులో పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ యత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు అన్ని రాజకీయ Read more

హైడ్రాకు మరో అధికారం..
hydraa ranganadh

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *