Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే సూపర్ హిట్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న ‘ఓదెల 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ‘నాగసాధువు‘ పాత్రలో నటించడంతో మరింత హైప్ పెరిగింది.ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది.దీంతో సినీ ప్రేమికులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా చిత్రబృందం ఓ గుడ్ న్యూస్‌తో ముందుకొచ్చింది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రక్తంతో తడిసిన తమన్నా లుక్ ఆకట్టుకుంటోంది.”అనుభూతి చెందాల్సిన పాత్ర” అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే
Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే

దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022లో విడుదలైన ‘ఓదెల’ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించి సూపర్ హిట్‌ను సాధించింది.ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ రాబోతోంది.ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, వశిష్ట ఎన్.సింహా, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్టశక్తుల నుంచి ఎలా రక్షించాడు అనేదే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది.అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts
రాజంపేట జైల్లో ఉన్న పోసాని
రాజంపేట జైల్లో ఉన్న పోసాని

సినీ పరిశ్రమలో వివాదాలు, వర్గ వైషమ్యాలు పెంచేలా చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని రేపాయి. ముఖ్యంగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు Read more

Robinhood: ప్రేక్షకుల ముందుకు ‘రాబిన్‌హుడ్‌’ ఫస్ట్ లుక్
Robinhood: ప్రేక్షకుల ముందుకు 'రాబిన్‌హుడ్‌' ఫస్ట్ లుక్

నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో భారీ సినిమా టాలీవుడ్ యువ నటుడు నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘రాబిన్ Read more

మాస్ డైరక్టర్‌స్‌కు స్ట్రెయిట్ ఆఫర్ ఇవ్వనున్న మెగాస్టార్..
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన క్రియేటివ్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న శ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఉహించిన Read more

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వేట్టయన్”
vettaiyan 265x198 1

సూపర్ స్టార్ రజినీకాంత్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ వంటి దిగ్గజాలు కలిసి నటించిన చిత్రం "వేట్టయన్". ఈ ఇంట్రెస్టింగ్ పోలీస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *