IPL 2025: నేటి నుంచే క్రికెట్ ప్రారంభం!

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ మ్యాచ్

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 2008లో మొదటి సీజన్‌తో మొదలైన ఈ క్రికెట్ మేళా 18వ సీజన్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఉత్కంఠను పంచుతుంది. ఈ సారి ఐపీఎల్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. కొత్త కాంబినేషన్లు, అనుభవసంపన్నులు, యువ టాలెంట్ కలబోసిన జట్లు – అన్ని ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయి. టోర్నీకి ముందు జరిగిన వేలంలో పలు ఆశ్చర్యకరమైన బిడ్డింగ్‌లు చోటు చేసుకున్నాయి. ఏ జట్టు బలంగా మారింది? ఎవరు కొత్తగా చక్కటి ప్రదర్శన ఇస్తారో చూడాలి.

Untitled design 2024 10 31T130826.035

2025 ఐపీఎల్ ప్రారంభ సమరం

ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. గతేడాది కేకేఆర్ అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఏడాది ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్‌లో గడచిన 17 సీజన్ల రికార్డులు విరాట్ కోహ్లీ – 8004 పరుగులు, 2008 నుంచి ఒకే ఫ్రాంచైజీ ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ ఏడాది కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తే, 9000 పరుగుల మార్కును చేరుకునే అవకాశముంది. యుజ్వేంద్ర చాహల్- 205 వికెట్లు గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన చాహల్, ఈసారి కూడా తన స్పిన్ మాంత్రికతను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం. విరాట్ కోహ్లీ – 8 సెంచరీలు టీ20 క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత తేలికైన పని కాదు. కానీ విరాట్ ఐపీఎల్‌లోనే 8 శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు. డేవిడ్ వార్నర్ – 66 అర్ధ శతకాలు వరుసగా మూడు సీజన్లలో 600+ పరుగులు చేసిన ఏకైక విదేశీ ఆటగాడు వార్నర్. క్రిస్ గేల్- 357 సిక్సర్లు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇప్పటికీ ఐపీఎల్ సిక్సర్ల రాజుగా ఉన్నాడు. శిఖర్ ధావన్- 768 ఫోర్లు ధావన్ తన ఫ్లోలో ఉంటే బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తాడు. ఏబీ డివిలియర్స్- 25 అవార్డులు ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ మ్యాచువిన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడు. అత్యధిక స్కోరు – సన్‌రైజర్స్ హైద‌రాబాద్ ఒకే ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేయడం అసాధారణమైన రికార్డు. విరాట్ కోహ్లీ – 114 క్యాచ్‌లు బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా విరాట్ అత్యుత్తమ ఆటగాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ధోనీ అంతటి లీడర్ మరొకరు లేరు. ఎంఎస్ ధోనీ – 226 మ్యాచ్‌లు కెప్టెన్సీ అంటే ఏమిటో ధోనీ నిరూపించాడు.

అత్యధిక సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌

ముంబై ఇండియన్స్ (MI) – 5 టైటిళ్లు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – 5 టైటిళ్లు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి. ఈ సారి కొత్త ప్లేయర్లు, ఆసక్తికరమైన మ్యాచ్‌లు, కొత్త రికార్డులు, ఉత్కంఠపూరిత సమరాలు ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.

Related Posts
7 పర్యటనల్లో పాకిస్థాన్ మూడు సార్లు వన్డే సిరీస్ గెల‌వ‌డం విశేషం
Pakistan

అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో చరిత్రాత్మక ఘనతను సాధించింది.21వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లు గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డుల్లో Read more

ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామం బ్రైడాన్ కార్స్ కు గాయం.
ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామం బ్రైడాన్ కార్స్ కు గాయం.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎదురుదెబ్బ తగిలింది. బ్రైడాన్సెమీ ఫైనల్ కార్స్ కాలి గాయంతో టోర్నమెంట్‌కు దూరమవ్వగా, అతని స్థానంలో స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. Read more

గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే
Ashwini Vaishnaw

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *