Bank employees strike postponed

Bank strike : బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

Bank strike : సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి లక్ష్మీపతిరావు, నాయకులు శేషుకుమార్‌, పాపారావు తెలిపారు. బ్యాంక్‌ యాజమాన్యాలు, సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌తో శుక్రవారం చర్చలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా త్వరలో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో సమ్మె వాయిదా వేశామని తెలిపారు. అందువలన సోమ, మంగళవారాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని వారు తెలిపారు.

  బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

తాత్కాలికంగా వాయిదా

శుక్రవారం ఒంగోలులోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ రాజీవ్‌రత్నదేవ్‌ మాట్లాడుతూ.. తాము చేపట్టిన సమ్మెపై సానుకూలంగా స్పందించడంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసారు. ఏప్రిల్‌ మూడవ వారంలో ఫైనాన్స్‌ మంత్రిత్వ శాఖతో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై సమవేశం జరుగు తుందన్నారు. ఈ సందర్భంగా సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వి.శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్‌, వెంకటరెడ్డి, శ్రీధర్‌, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, సుధాకర్‌రావు, హసన్‌, బ్రహ్మనాయుడు, ఏడుకొం డలు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది.

కాగా, యూఎఫ్‌బీయూ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సమ్మె జరిగితే మార్చి 22 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది. ఎందుకంటే మార్చి 23న కూడా బ్యాంకులకు సెలవు దినం ఉంది. సమ్మె జరిగితే దీనివల్ల నగదు లావాదేవీలు, చెక్ క్లియరింగ్, చెల్లింపులు, రుణాల ప్రక్రియ వంటి వాటిపై ప్రభావం పడేది. యూఎఫ్‌బీయూలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ సహా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు.

Related Posts
ఓ పార్టీలో ట్రంపును కలిసిన అంబానీ జంట
trump and muskesh couple

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత Read more

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడి గిప్ట్..
Muslim Bharatanatyam artist

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడు భారీ గిఫ్ట్ అందజేసి వార్తల్లో నిలిచాడు. మనసున్న భక్తుడికి మతం పెద్దది కాదు..అని జహీర్ హుస్సేన్ అనే వ్యక్తి నిరూపించాడు. తమిళనాడులోని Read more

తెలంగాణ కోసం చస్తాం కాంగ్రెస్‌కు తలవంచం: కేటీఆర్
తెలంగాణ కోసం చస్తాం కాంగ్రెస్‌కు తలవంచం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం మరోసారి తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైఫల్యాలకు ప్రశ్నించడం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చీఫ్ Read more

భూ హక్కు లబ్దిదారులకు ప్రాపర్టీ కార్డులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తీపి కబురు వినిపించారు. అర్హులైన లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను అందించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *