18 MLAs suspended in Karnataka Assembly

Karnataka : కర్ణాటక అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Karnataka : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పదవిని అగౌరవపరిచినందుకు క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు భైరతి బసవరాజ్, డా. శైలేంద్ర బెల్దాలే, మునిరత్న, ధీరజ్ మునిరత్న, బిపి హరీష్, డా. భరత్ శెట్టి, చంద్రు లమాని, ఉమానాథ్ కోటియన్, రామమూర్తి, దొడ్డనగౌడ పాటిల్, డా. అశ్వత్ నారాయణ్, యశ్‌పాల్ సువర్ణ, బి. సురేష్ గౌడ, శరణు సలగర, చన్నబసప్ప, బసవరాజ మట్టిముడ, ఎస్ఆర్ విశ్వనాథ్‌లను మార్షల్స్ సభ నుండి బయటకు తీసుకెళ్లారు.

కర్ణాటక అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలపై

స్పీకర్ కుర్చీ ముందు కాగితాలను చింపి విసిరారు

హనీ-ట్రాప్ కేసుల అంశం, కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం సృష్టించి, సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా.. సభలోని వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలను చింపి విసిరారు. దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు. ఇక, సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం.. వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారీ భత్యాలు కూడా అందవు. ఇక సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తరలించారు.

Related Posts
Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు
Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు

ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆయుధ కర్మాగారానికి చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఛార్జ్‌మెన్‌గా పనిచేస్తున్నరవీంద్ర కుమార్‌ను పాకిస్తాన్‌కు రహస్య Read more

నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు పన్నున్ హెచ్చరిక
Dont fly Air India from November 1 19. Khalistani terrorist Pannuns new threat

న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య Read more

25 భాషలను మింగేసిన హిందీ:స్టాలిన్
25 భాషలను మింగేసిన హిందీ:స్టాలిన్

త్రిభాషా విధానం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించగా, తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *