Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రేపు పోసాని విడుదలయ్యే అవకాశం
ఇప్పుడు తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్‌పై విడుదల అవుతారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత మూడు సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది.

Related Posts
నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
registration charges

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు Read more

దూసుకుపోతున్న నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ
MURA film still

ఈ వారం మలయాళంలో విడుదలైన ఆసక్తికర చిత్రాలలో 'మురా' ఒకటి. విడుదలకు ముందే తన టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, థ్రిల్లింగ్ కథనంతో Read more

(Suriya) ఆసక్తికర కామెంట్స్‌ చేశారుటా లీవుడ్‌ హీరోలపై;
surya

ఇంటర్నెట్ డెస్క్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా టాలీవుడ్ అగ్రహీరోలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగువా నవంబర్ 14న విడుదల Read more

Chiranjeevi : సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
Chiranjeevi: సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

రోదసి నుంచి భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రికురాలు సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు 9 నెలల పాటు అంతరిక్షంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *