Visakhapatnam Metro tenders to be completed by May end..Minister Narayana

Minister Narayana : మే నెలాఖరులోగా విశాఖ మెట్రో టెండర్లు పూర్తి: మంత్రి నారాయణ

Minister Narayana : ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని చెప్పారు. మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్‌ సిటీ విశాఖ మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షించినట్లు తెలిపారు.

  మే నెలాఖరులోగా విశాఖ మెట్రో

వైసీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌

ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్‌ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని.. విశాఖలో 600కు పైగా టీడీఆర్‌ బాండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్‌ త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా డీవియేషన్‌ జరిగిందని మంత్రి తెలిపారు.

Related Posts
ఏపీలో త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
premium liquor stores

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల విక్రయానికి ప్రత్యేకంగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ Read more

విద్యా పరమైన ఆవిష్కరణలకు కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్
KLH Global Business School at the forefront of educational innovation

ఢిల్లీ: కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇటీవల, 2024 డిసెంబర్ 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు రెండు వారాల పాటు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ Read more

అదానీపై కేసు.. స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం
White House Responds To Adani Bribe Gate Allegations

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై కేసు నమోదుకావడం గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రూ. 2,029 కోట్ల లంచాలు Read more

గాజాలో UN సహాయ లారీలు లూటీకి గురైన ఘటన
100 gaza aid trucks

గాజాలో శనివారం జరిగిన ఒక సంఘటనలో 109 యూనైటెడ్ నేషన్స్ (UN) సహాయ లారీలు దోచబడినట్లు ఫలస్తీనా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *