speaker ayyannapatrudu anger at Assembly members!

YSRCP : దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం !

Ayyannapatrudu: ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా? అంటూ సభ్యులను స్పీకర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరుకావాల్సి ఉందన్నారు. వైసీపీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు.

దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు అసెంబ్లీ

వీరెవరూ సభకు హాజరు కాలేదు

వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, దాసరి సుధ తదితరులు సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్‌ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. హాజరుపట్టిలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు స్పీకర్‌గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవొద్దంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా

గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. అంటే ఫిబ్రవరి 24 తేదీ తర్వాత వేర్వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ వారెవరు నాకు సభలో కనిపించలేదు.. ఇది సమంజసమో వారే నిర్ణయించుకోవాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి.. ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా ప్రవర్తించకూడదని నా అభిప్రాయం’ అంటూ సభలో అయ్యన్నపాత్రుడు ప్రకటన చేశారు.

Related Posts
హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
telangana new highcourt wil jpg

ts-high-court హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, Read more

చంద్రబాబుకి భయపడను: జగన్
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కొత్త చర్చకు కారణమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో ఎమ్మెల్సీ Read more

ఫుట్ బాల్ మ్యాచ్‌లో వివాదం..100 మందికిపైగా మృతి!
Controversy in a football match. More than 100 people died

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం గినియాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం Read more

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు
Purandeswari పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ వర్గాల నుండి శుభాకాంక్షల వెల్లువ ఊహించదగినదే. కూటమి పార్టీల నేతలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *