Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఎదురు కాల్పులు పలువురు మావోయిస్టుల

మావోయిస్టులకు భారీ నష్టం

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. బీజాపుర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.

Related Posts
9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
Telangana Thalli Statue to

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ.. కొత్త విగ్రహాన్ని ఈనెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో Read more

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
Sankranti holidays announced by Inter Board

హైరదాబాద్‌: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు Read more

Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ
tirupati stampede

తిరుపతి ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు Read more

నా వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌ – సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణ తలసరి ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *