Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్ అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాను “దరిద్ర దేశాలలో ఒకటి” అంటూ వ్యాఖ్యానించారు.

ఒక ఇంటర్వ్యూలో కెనడాపై ఆయన ఎప్పుడూ ఎందుకు కఠినంగా ఉంటారో ప్రశ్నించగా ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తానని కానీ కెనడాతో వ్యవహరించడం చాలా కష్టమని ట్రంప్ అన్నారు.కెనడా చెత్త దేశాల్లో ఒకటిగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కెనడాలో తీవ్ర దుమారం రేపాయి.అమెరికా కెనడాకు ఏటా 200 బిలియన్ డాలర్లు సబ్సిడీ అందిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Donald Trump కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్
Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

అందుకే కొందరు కెనడాను 51వ రాష్ట్రంగా పరిగణిస్తున్నారని వివరించారు.అయితే అమెరికాకు కెనడా అవసరం లేదని, వారి కలప, శక్తి వనరులు, ఆటోమొబైల్స్ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు.ఇటీవల మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ట్రంప్ తన దురుసు మాటలను తగ్గిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. కెనడాపై అమెరికా కఠిన వైఖరి అనవసరమని, పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని కార్నీ అభిప్రాయపడ్డారు.ట్రంప్ వ్యాఖ్యలు కెనడా-అమెరికా సంబంధాలను మరింత విషమింపజేస్తాయా? లేదా, ఈ వివాదం త్వరలో సమసిపోతుందా అనేది చూడాలి.

Related Posts
మంచిర్యాలలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
food poisoning telangana go

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి, ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలలో ఎదురైన ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి. పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ Read more

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Lucknow court summons Rahul Gandhi

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు.సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు.న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ Read more

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ
AP Jithender Reddy

తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన జితేందర్, ఈసారి టీఓఏ అధ్యక్ష ఎన్నికల్లో Read more

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు
PM Modi wishes CM Revanth Reddy on his birthday

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి నల్లగొండి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట యాదాద్రి ఆలయానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *