Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

Bhavana : భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

Bhavana : భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఒంటరి మహాత్మ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భావన, గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై స్పందించారు. భర్త నుంచి విడాకులు తీసుకుంటోందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.తనపై వస్తున్న తప్పుడు వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భావన కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోకపోవడం వల్లే ఈ రకమైన అపోహలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం
Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయాలనే బాధ్యత నాకు లేదు.నా భర్తతో కలిసి ఫొటోలు పోస్టు చేయకపోతేనే మేమిద్దరం విడిపోయినట్టా అని భావన ప్రశ్నించారు. తాము హ్యాపీ లైఫ్ గడుపుతున్నామని తమ ప్రైవసీకి విలువ ఇచ్చే వ్యక్తులమని ఆమె స్పష్టం చేశారు.వ్యక్తిగత జీవితాన్ని జనాల ముందుకు తీసుకురావడం తనకు ఇష్టం లేదని ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేయకపోతే అనవసరమైన ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.భర్త నవీన్‌తో తమ అనుబంధం బలంగా ఉందని చెప్పిన భావన, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరారు.

తాము సంతోషంగా ఉన్నామనే విషయం తెలుసుకునే బదులుగా అసత్య కథనాలను వ్యాప్తి చేయడం బాధించిందని ఆమె అన్నారు.ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే తాను సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పోస్టు చేయనని మరోసారి స్పష్టం చేశారు.ఆమె స్పష్టమైన వివరణతో ఈ రూమర్లు కొంతవరకు తగ్గనున్నాయని భావిస్తున్నారు.అభిమానులు నెటిజన్లు కూడా ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుతున్నారు.

Related Posts
 తమిళ హీరో విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన పవన్ కల్యాణ్
vijay pawan kalyan

తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతను గతంలోనే తన రాజకీయ లక్ష్యాలను ప్రకటించినా, ఇటీవల విజయ్ Read more

పది రోజుల షూటింగ్ కోసం ఎన్ని కోట్లు అంటే.
Alia Bhatt

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్ పేరు ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ తోనే Read more

విడాకులు తీసుకున్న అమ్మాయికి సమాజం రకరకాల ట్యాగ్‌లు వేస్తారంటూ ?????
samantha 3

టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం తన జీవితంలో వివిధ దశలను అధిగమిస్తూ కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. విడాకులు, ఆరోగ్య సమస్యలు వంటి సమస్యల మధ్య Read more

99 శాతం మగవారిదే తప్పు అంటున్న నటి కంగనా
kangana ranaut

బెంగళూరులోని AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. అతులిపై ఉన్న మద్దతు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *