కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు
కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు విధ్వంసంతో
ఏం ప్రయోజనం సాధిస్తారు
ఔరంగజేబు మంచివాడా లేక చెడ్డవాడా ఔరంగజేబ్సమాధిని కూల్చేయండి ఇదే ఇప్పుడు
వినిపిస్తున్న డిమాండ్ మరి ఔరంగజేబ్
సమాధితోనే ఆగుతారా లేక ఆ తర్వాత షాజహాన్
జహంగీర్ అక్బర్ హుమాయున్ బాబర్ ఇట్లా
వెనక్కి వెనక్కి తవ్వుకుంటూ వెళ్తారా
తెలీదు అసలు ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది ఈ
మధ్యే చావా అనే సినిమా రిలీజ్ అయింది అది
తెలుగులో కూడా డబ్బింగ్ అయింది ఇందులో
మరాఠా పాలకుడు సంభాజీని ఔరంగజేబ్ ఎలా
చంపాడో కొన్ని దృశ్యాలు ఉన్నాయి మరాఠా
సామ్రాజ్యాన్ని ఎలా దెబ్బ కొట్టాడో అసలు
ఔరంగజేబ్ ఎంత దుర్మార్గుడో ఇందులో
చూపించారు నిజానికి ఈ సినిమాతోనే ఔరంగజేబ్
గురించి కొత్తగా ప్రపంచానికి తెలియలేదు
ఔరంగజేబ్ చరిత్రపై వాదనలు
ఆల్రెడీ తెలుసు అతని గురించిన భిన్న
వాదనలు ఇప్పటికే మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా
చర్చిలో ఉన్నవే ఔరంగజేబ్ క్రూరుడు
దుర్మార్గుడు గుళ్ళు కూల్చాడు పనులు
వేసాడు జనాన్ని పీడించాడు ఇవన్నీ చాలా
మంది చెప్పుకునేవే ఈ సరే ఇందులో ఈ
చరిత్రలో నిజమా కాదా అనే చర్చలోకి వెళ్లడం
లేదు ఇప్పుడు ఔరంగజేబ్ సమాధిని కూల్చడం
అనే దాని గురించి మాత్రమే పరిమితం.
సమాధి విషయంలో వివాదం
ఈ ఔరంగజేబ్ సమాధి ఎక్కడ
ఉందంటే మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో
ఉంది ఔరంగాబాద్ పట్టణానికి ఓ పాతి
కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్దాబాద్ లో
చావా సినిమా తర్వాత అసలు ఇంత
దుర్మార్గుడి సమాధిని ఉంచడం అవసరమా దాన్ని
తీసి పారేయండి ధ్వంసం చేయండి ఇది మా బాధకి
బానిసత్వానికి చిహ్నం అంటున్నారు నాగపూర్
లో దీని గురించి అల్లర్లు జరుగుతున్నాయి
ప్రస్తుత పరిస్థితి
దాడులు ప్రతిదాడులు జరిగాయి కార్లు
బైకులకు నిప్పు పెట్టారు అద్దాలు
పగలగొట్టారు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ
విధించాల్సి వచ్చింది ఇది ప్రస్తుత
పరిస్థితి మరి ఔరంగజేబ్ సమాధిని ఉంచాలా
తీసేయాలా ఏది కరెక్ట్?
ఔరంగజేబ్ గురించి వివిధ దృక్పథాలు
ఔరంగజేబ్ కు
సంబంధించి మన దగ్గర రెండు వెర్షన్లు
ఉన్నాయి చాలా దుర్మార్గుడు పన్నులు వేశాడు
జనాల్ని దుర్మార్గంగా పీడించాడు గుళ్ళు
గోపురాల్ని ధ్వంసం చేశాడు అని మరి అక్బర్
లాంటివార్ల గురించి ఎంతో కొంత పాజిటివ్
గా చెప్పుకున్నట్టే ఔరంగజేబ్ గురించి చాలా
వ్యతిరేకంగా చెప్పుకుంటారు.
రాజులలో క్రమశిక్షణ
అదే సమయంలో
ఇతని గురించి చెప్పుకునే మరో డిఫరెంట్
వెర్షన్ కూడా ఉంది చాలా క్రమశిక్షణతో
బతికాడని చక్రవర్తి అయి ఉండి కూడా విందులు
విలాసాలకు దూరంగా ఉండి తన సంపాదనతోనే
బతికాడని చెప్తుంటారు సరే ఏది నిజం ఏది
అబద్ధం అనేది తర్వాత సంగతి.
చరిత్రలో పరిష్కారం
ఔరంగజేబ్ దుర్మార్గుడే అనుకుందాం అయితే
అతని సమాధిని ధ్వంసం చేయడం పరిష్కారం అవుతుందా
అది సరైన పనే అవుతుందా ఇక్కడ ఒక విషయం
మాట్లాడుకుందాం రాజు ఎక్కడైనా నిరంకుశుడే
రాజు ఎవరైనా నిరంకుశుడే యుద్ధానికి చేయని
రాజు లేడు జనంపై పన్నులు వేయని రాజు లేడు.
రాజ్యాన్ని విస్తరించడం
ఒకరు ఎక్కువైతే ఒకరు తక్కువై ఉండొచ్చు
కానీ రాజుల లక్షణమే యుద్ధం చేయడం
రాజ్యాన్ని విస్తరించడం తన రాజ్యాన్ని
కాపాడుకోవడం అంగరంగ వైభవంగా బతకడం జనం ఎలా
బతికినా వాళ్లకు మాత్రం పేరొచ్చేలా భారీ
నిర్మాణాలు కోటలు గుళ్ళు గోపురాలు కట్టడం
ఇదే కదా వాళ్ళు చేసింది ఒకసారి తెలంగాణ
చరిత్రను చూద్దాం మనం కాకతీయుల గురించి.
సామ్రాట్ అశోకుడి పాఠాలు
చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటాం కానీ ఈ
కాకతీయులే కదా ఆదివాసులపై యుద్ధాలు
చేసింది పీడించింది మరి ఆదివాసుల కోణంలో
నుంచి చూసినప్పుడు కాకతీయులను ఏమనాలి
విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయుల
గురించి మనం ఎంతో ఘనంగా చెప్పుకుంటాం కానీ
శ్రీకృష్ణదేవరాయులు యుద్ధాయులు చేయకుండా
ఉన్నాడా ఏ కోటని కూల్చకుండా ఎవరిని
చంపకుండా ఉన్నాడా.
చరిత్రతో మార్పు
ఈ మూలన ఉన్న కర్ణాటక
నుండి పైన ఉన్న ఒడిస్సా వరకు వెళ్ళాడు
యుద్ధాలే కాదు అసలు జనం నుండి
కృష్ణదేవరాయలు ఏం వసూలు చేయలేదా అలా
చేయకుండానే రాజ్యం నడిచిందా ఖచ్చితంగా
కాదు మనం కృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ
సార్వభౌముడు అని కీర్తిస్తుంటాం అంటే
కొన్ని యుద్ధాలు తమను కాపాడుకోవడానికి
కొన్ని యుద్ధాలు రాజ్యాన్ని
విస్తరించడానికి అందరిలాగే కృష్ణదేవరాయులు
చేశాడు.
చరిత్రలోని నిజాలు
ఓసారి సామ్రాట్ అశోకుడి సంగతి చూద్దాం
అశోకుడికి యుద్ధ రంగంలోనే జ్ఞానోదయం
అయింది అంటారు కళింగ యుద్ధంలో మార్పు
చెంది హింస వైపు మళ్ళాడు అని చెప్తారు
ఇట్లాగే దేశంలో ఎంతో మంది రాజులు
కనిపిస్తారు ఇక్కడ వీళ్ళని ఎవరిని
ఔరంగజేబు తో పోల్చడం లేదు అసలు ఎవరిని
ఎవరితో పోల్చాల్సిన పని లేదు కానీ అందరి
చేతులు రక్తసిక్తమై అందరి చరిత్ర యుద్ధ
కాంక్షతో నిండినదే.
చరిత్ర నుండి నేర్చుకోవడం
ఔరంగజేబు ఆలయాలని
కూలగొట్టించాడు అంటున్నారు కదా ఇక్కడ ఒకటి
గమనించాలి ఆయన మసీదుల్ని కూడా
కూలగొట్టాడు తానీషా పన్నులు కట్టకుంటే
గోల్కొండలో ఆ సంపద దాచిన మసీదుని ఔరంగజేబ్
కొలగొట్టించాడు అని చెప్తారు అంటే రాజుకి
తమ రాజ్యాన్ని తమ ఆధిపత్యాన్ని
నిలబెట్టుకోవడమే ప్రధానం తమ ఖజానాన్ని
నింపుకోవడమే ప్రధానం తప్ప వాళ్లకు
అవసరమైనప్పుడు అవతల వాళ్ళు ఎవరు ఏంటి
అనేది చూడరు.
చరిత్రలో విధ్వంసం
ఇలాంటి విధ్వంసాలకు దిగుతూనే
కొంతమంది రాజులు జనానికి పనికొచ్చే పనులు
ఎక్కువగా చేసిన వాళ్ళు ఉంటారు మరి
కొంతమంది జనాల్ని ఎక్కువగా పీడించి ఉంటారు
చెరువులు కాలువలు తవ్వించిన వాళ్ళు
ఉన్నారు వ్యవసాయాన్ని ప్రోత్సహించిన
వాళ్ళు ఉన్నారు జనాన్ని హింసించకుండా
అన్ని మతాలతో సామరస్యంగా ఉన్న రాజులు
ఉన్నారు ఒక మతాన్నే ప్రోత్సహించి
పరమతాన్ని అనుసరించే వాళ్ళను హింసించిన
పాలకులు ఉన్నారు.
మంచిని మంచి చెడుని చెడు అని అధ్యయనం
చేయడానికి గుర్తుంచుకోవడానికి విధ్వంసం
అవసరం లేదు వివేకం చాలు 140 కోట్ల
నిండుకుండ లాంటి భారతదేశంలో అనేక సమస్యలు
ఉన్నాయి జీవన ప్రమాణాలు అనేక రాష్ట్రాల్లో
అత్యంత దయనీయంగా ఉన్నాయి ఆసుపత్రులు లేవు
స్కూల్ లేవు స్కూళ్లలో టీచర్లు ఉండరు
ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు మందులు
ఉండవు.