గ్రీన్ కార్డు రద్దు అవ్వడం – ఏమైనా జరిగేనా?
గ్రీన్ కార్డున్నా గెంటేస్తారా.గ్రీన్ కార్డు సడన్ గా రద్దయ్యే ఛాన్స్ ఉంది. దేశం దాటితే మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టనివ్వరా? కాస్త రూల్స్ ఉల్లంఘించిన వెంటనే వెనక్కి పంపేస్తారా? జరుగుతున్నవన్నీ ఇదే చెప్తున్నాయి. ఎందుకంటే ఓవర్ నైట్ రూల్స్ మారిపోతున్నాయి. ఎవరికీ ఇక్కడ సెక్యూరిటీ లేదు అని చెప్పేస్తున్నారు. దేనికి గ్యారెంటీ లేదు అనే హింట్ ఇస్తున్నారు.
సిటిజన్షిప్ సంబంధిత మార్పులు
నిన్నటి దాకా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి సిటిజన్ షిప్ ఎందుకు ఇవ్వాలి అన్నారు. దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసారు. పేరెంట్స్ లో ఒక్కళ్ళకైనా గ్రీన్ కార్డు ఉండాలి లేదా సిటిజన్ షిప్ ఉంటేనే వాళ్ళ పిల్లలకి ఇస్తామన్నారు. దాని తరువాత గోల్డ్ కార్డు అనే కొత్త పధ్ధతి మొదలు పెట్టారు. అంటే ఇది సిటిజన్ షిప్ అమ్మకం లాంటిది.
గ్రీన్ కార్డు రేటు పెరిగిన కధ
ఇప్పటివరకు ₹9 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చి గ్రీన్ కార్డు వచ్చేది, దాన్ని గోల్డ్ కార్డు అంటారు. దాని రేటు పెంచేసి 44 కోట్ల రూపాయలు చేశారు. అంటే అమెరికా సిటిజన్ షిప్ ని అమ్మకానికి పెట్టారు.
కొత్త సమస్యలు
ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకోటి మొదలైంది.గ్రీన్ కార్డున్నా గెంటేస్తారా.గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరిని టెన్షన్ పెట్టే పనులు మొదలయ్యాయి. గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రాన సంబర పడొద్దు. గ్రీన్ కార్డు ఏమి మీకు ఇక్కడ లైఫ్ టైం ఉండటానికి రాసి ఇచ్చినట్టు కాదు. ఏ నిమిషమైనా అది రద్దు అవుతుంది అంటున్నారు.
జెడి వాన్స్ వ్యాఖ్యలు
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఏమంటాడంటే, “గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ గా హక్కు ఉందనే గ్యారెంటీ ఏమీ లేదు” అని చెప్పాడు. గ్రీన్ కార్డు వచ్చింది కదా అని బిందాస్ గా ఉంటాం అనుకుంటే కుదరదు అంటున్నాడు.
అమెరికాలో ప్రోటెస్టులపై చర్యలు
గ్రీన్ కార్డు కోసం కొత్తగా ప్రయత్నిస్తున్న వాళ్ళనే కాదు, ఆల్రెడీ ఆ గ్రీన్ కార్డు తో ఉన్న వాళ్ళలో కూడా టెన్షన్ కి కారణం అవుతోంది. ఫాక్స్ న్యూస్ లో ది ఇంగ్రాహమ్ యాంగిల్ అనే ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పాడు జెడి వాన్స్.
అమెరికా ప్రజల నిర్ణయాలు
అమెరికా సమాజంలో ఎవరికి స్థానం కల్పించాలి, ఎవరిని ఉండనివ్వాలి, ఎవరిని బయటికి పంపాలి ఈ విషయంలో అమెరికా ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అని జెడి వాన్స్ చెప్పారు.
చట్ట ప్రకారం నిర్ణయాలు
మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? అమెరికా చట్టాలే కదా! అమెరికాలో ఎవరికి గ్రీన్ కార్డు ఇవ్వాలో, ఎవరికివ్వద్దో ఆ చట్టం ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు.
వీసా సిస్టం
ఇక వర్క్ వీసాలకు సంబంధించి లాటరీ సిస్టం ఉంది. దాన్ని ఎంతమందికి ఇవ్వాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. విసిటింగ్ వీసాలు ఇచ్చే ముందు కూడా అనేక రకాలుగా చెక్ చేస్తారు.
సోషల్ మీడియా వీసా
ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లు చూసే వీసాలు ఇస్తున్నారు. అన్ని కండిషన్స్ ఓకే అనుకుంటేనే ఎలాంటి అనుమానం లేదు. అనుకుంటేనే వీసాలు ఇస్తున్నారు. లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు.
గ్రీన్ కార్డు సంబంధిత మరిన్ని వివరాలు
ఇక గ్రీన్ కార్డు కోసం అయితే అదో పెద్ద తతంగం. అదంతా తేలిగ్గా వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఏళ్ల తరబడి క్యూ నడుస్తోంది. గ్రీన్ కార్డు ఏమి ఆటోమేటిక్ గా రాదు. దానికి కూడా అనేక కండిషన్స్ ఉన్నాయి.
అమెరికాలో వాస్తవ పరిస్థితులు
గ్రేన్ కార్డు గురించి ఇప్పుడు కొత్తగా “అమెరికన్లే డిసైడ్ చేయాలి” అనడం విచిత్రమైన విషయం. నిజానికి ఇది విచిత్రం కూడా కాదు. వైట్ రెసిస్ట్ భావజాలానికి పట్టం కట్టే ట్రంప్ & టీం అమెరికా ఫస్ట్ అనే నినాదం ద్వారా ఎవరూ రానివ్వాలి లేదా రానివ్వకూడదో నిర్ణయించడం జరుగుతుంది.
ప్రోటెస్టుల కారణంగా గ్రీన్ కార్డు రద్దు
ప్రస్తుతం గ్రీన్ కార్డు ఉన్నవాళ్లకు ప్రోటెస్టులు చేయడంలో మరింత సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివి చట్టాల్లో చాలానే ఉంటాయి, కానీ ఇప్పుడు చిన్న ప్రొటెస్ట్ చేసినవారిని కూడా వెనక్కి పంపించగలరు అని ట్రంప్ టీం అంటోంది.
గ్రీన్ కార్డు హోల్డర్స్ పై చర్యలు
అందుకే గ్రీన్ కార్డు ఉన్న సిరియన్ మహమ్మద్ ఖలీల్ ని అరెస్టు చేసి వెనక్కి పంపించారు. దీన్ని చూసిన తర్వాత అనేకమందిలో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.
మరింత అవగాహన
ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నవాళ్ల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్లకు కొత్తగా గ్రీన్ కార్డులు వస్తాయా లేదా ఉన్నవి రద్దు అవుతాయా అనే సందేహం కలుగుతోంది.
సిటిజన్ షిప్ అమ్మకం
44 కోట్లు కడితే సిటిజన్ షిప్ అమ్మేస్తారన్న మాట కూడా ఉంది.
ఇంకో సంఘటన: అమెరికా గ్రీన్ కార్డు ఉన్న జర్మన్ ఫేబియన్ స్మెడ్ అనే వ్యక్తి లగ్జంబర్గ్ వెళ్లి, తిరిగి లాస్ ఏంజెల్స్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు అతన్ని ఇంటరాగేషన్ చేశారు.
ఎయిర్పోర్ట్ నిర్బంధం
ఇంటరాగేషన్ సమయంలో అతనికి ఏ కారణం చెప్పకుండా, బట్టలు విప్పించి, నీళ్లు కూడా ఇవ్వకుండా డిటెన్షన్ సెంటర్ కు పంపించారు.ఇటువంటి చర్యలు గ్రీన్ కార్డు హోల్డర్లపై పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ పై ఫోకస్ పెరిగిందని కూడా తెలుస్తోంది.
గ్రీన్ కార్డు హోల్డర్లను ఎయిర్పోర్ట్ లోనే పడ్డినపుడు వారి ఫ్యామిలీ అంగీకరించకపోతే వీసా దొరకడం లేదు.