Telangana:నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana:నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు “రాజీవ్ యువ వికాసం” పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు మార్చి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఏప్రిల్ 5, 2025 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

 రాజీవ్‌ యువ వికాసం పథకం

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఆర్ధిక సాయం అందించేందుకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు రూ.6 కోట్ల వరకు మంజూరు చేస్తారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్‌ 5, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఈ ఏడాదికి రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను ఈ పథకం కింద మంజూరు చేయనుంది.

అర్హతలు

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్యబట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జీఎం శంకర్‌రావు తెలిపారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు కేటగిరీ 1, 2, 3వారీగా రుణాలు ఖరారు చేస్తారు. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఉంటే, మిగతా 20 శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు చెల్లించడమో జరుగుతుంది. ఇక కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షలలోపు రుణాలు ఇస్తారు.

istockphoto 1470139584 612x612

అప్లికేషన్స్ వెరిఫికేషన్

ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్‌ 2న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తారు. ఇతర వర్గాలకు కూడా ఈ పథకాన్ని భవిష్యత్తులో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.ఈ పథకం ద్వారా లక్షలాది నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన లభించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా తెలంగాణ యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం.

Related Posts
హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ Read more

ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Property tax

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలక శాఖ తాజాగా జారీ చేసిన Read more

స్థానిక సంస్థల ఎన్నికలు కేసీఆర్ అలర్ట్ ….
kcr and revanthreddy

ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కుల గణన పూర్తి చేయటం తమ భారీ సక్సెస్ గా ప్రభుత్వం Read more

ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ తీపి కబురు
minister damodar raja naras

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి Read more