బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌తో స్నేహబంధం, తన పలు ఆసక్తికర విషయాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు.ఆమీర్ ఖాన్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా ఆయన ప్రకటించారు.గౌరీతో ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నానని, ఆమెను గత 25 ఏళ్లుగా తెలుసని చెప్పారు.
పెళ్లి,విడాకులు
ఆమీర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావ్‌తో విడిపోయిన తర్వాత, ఆయన ప్రేమలోకి మళ్లీ ప్రవేశించడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.బెంగళూరుకు చెందిన ఆమె తన ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తున్నట్లు ఆమిర్ చెప్పారు. గౌరీకి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు రీనా దత్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు.గౌరీలో తనకు నచ్చిన విషయాన్ని వెల్లడించాడు. ‘నన్ను ప్రశాంతంగా ఉంచే, నాకు పీస్ ను ఇచ్చే భాగస్వామి కోసం నేను వెతుకుతున్నాను.’ గౌరికి ఆ లక్షణాలు ఉన్నాయి అనిఆమీర్ ఖాన్ అన్నారు. అలాగే గౌరీ మాట్లాడుతూ ‘నాకు మంచి వాడు, సౌమ్యుడైన, శ్రద్ధగల వ్యక్తి అవసరం.’ “అప్పుడు నేను ఆమీర్ ఖాన్ ను కలిశాను” అని గౌరి తెలిపింది.

ఆమీర్ ఖాన్ , గౌరీ 25 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. 25 సంవత్సరాలుగా తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య అంతగా మాటలు ఉండేవి కాదు. “మేము ఒకటిన్నర సంవత్సరం క్రితం మళ్ళీ పరిచయమయ్యాము” అని ఆమీర్ ఖాన్ అన్నారు.గౌరి బెంగళూరులో పెరిగింది. ఇక ఆమీర్ ఖాన్ మార్చి 14, 1965న జన్మించాడు. అదేవిధంగా, గౌరి ఆగస్టు 21, 1978న జన్మించింది. ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాలగ్యాప్ ఉంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో చాలా చర్చ జరుగుతోంది.
డ్రీమ్ ప్రాజెక్ట్
అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’ స్క్రిప్ట్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ వర్క్ మాత్రమే మొదలు పెడుతున్నామని చెప్పిన ఆయన,దీని కోసం ఒక టీమ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామని, ఏం జరుగుతుందో చూడాలని ఆమిర్ పేర్కొన్నారు. ఇక సల్మాన్, షారూఖ్లతోనూ తనకు మంచి అనుబంధం ఉందన్నారు. బుధవారం నాడు వారిద్దరినీ కలిసినట్లు తెలిపారు.తమ ముగ్గురి కలయికలో సినిమా వస్తే బాగుంటుందని తామూ అనుకుంటున్నామని, అయితే మంచి స్క్రిప్టు దొరకాలనీ, దాని కోసమే ఎదురు చూస్తున్నామని ఆమిర్ నవ్వుతూ చెప్పారు.