సినిమా విడుదల సమయానికి ప్రొమోషన్స్‌లో ఓవర్‌ద టాప్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే, కొన్ని వ్యాఖ్యలు హద్దు దాటి వెళ్తే, అవి పెద్ద చర్చనీయాంశంగా మారతాయి. తాజాగా, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ మూవీ నిర్మాత రవి కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
నిర్మాత వ్యాఖ్యలు
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో ఫైట్స్ చూసి థియేటర్ స్క్రీన్స్ చింపేయడం పక్కా!’’ అంటూ రవి కుమార్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, ‘‘ఇది నిజం కాకపోతే, సినిమా రిలీజ్ రోజే మధ్యాహ్నం పెట్టే ప్రెస్ మీట్‌లో నన్ను చితక్కొట్టేయండి’’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నిర్మాత ఈ స్థాయిలో భారీ స్టేట్మెంట్స్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.సినిమా హిట్ అయితే నిర్మాత కామెంట్స్ నిజమవుతాయి, కానీ సినిమా ఆశించిన స్థాయిలో లేకుంటే, ఆయన స్వయంగా ఇచ్చిన ఆఫర్ ఏ స్థాయిలో వెనుకబడి ఉండనుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ సినిమా ప్రీ రిలీజ్ ప్రొమోషన్స్‌లో హీరోలు, డైరెక్టర్లు ఇచ్చిన భారీ స్టేట్మెంట్స్ తర్వాత ఫ్లాప్ మూవీ కారణంగా ట్రోలింగ్‌కి గురవడం జరిగింది. ఇప్పుడు ‘దిల్ రూబా’ నిర్మాత రవి కుమార్ విషయంలో అదే జరిగే అవకాశముందా? అన్నది అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది.
వివాదస్పద కామెంట్స్
ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. ఈ మూవీని లవర్‌తో కాకుండా ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో చూడాలని ఆయన సూచించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘ఈ సినిమాకి వీలైతే మీ లవర్‌తో వెళ్లండి, కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ మీ ఎక్స్‌తో వెళ్లండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా బయటికి వస్తారు’’ అంటూ కామెంట్ చేశారు.ఈ వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, మరికొంత మంది మాత్రం ఇది సరదా కోణంలో తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్ లాంటి అంశాలను టచ్ చేసే సినిమాల్లో ఇలాంటి ప్రమోషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, దీనిపై జనాలు ఎలా స్పందిస్తారన్నదే కీలకం.

దిల్ రూబా’ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించగా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదలకు ముందు ఇంతలా ప్రచారం జరుగుతుండటంతో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విడుదలకు ముందు భారీ స్టేట్మెంట్స్ ఇచ్చి తర్వాత ట్రోలింగ్‌కు గురైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మరి ‘దిల్ రూబా’ మూవీ నిజంగానే థియేటర్లలో గర్జిస్తుందా? లేక నిర్మాత రవి కుమార్ ఓవర్ ప్రామిస్ చేసి ట్రోలింగ్‌కి గురవుతారా? అనేది చూడాలి!