Being in the opposition is not new to us.. YS Jagan

ప్రతిపక్షంలో ఉండటం మనకి కొత్త కాదు : వైఎస్‌ జగన్‌

అమరావతి: కూటమి సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. చదువు, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్‌గానీ ఇలా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పుకొచ్చారు.ఏడాది అవుతున్నా ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కాలేదన్నారు.

image

ప్రజల కష్టాల నుంచి పార్టీ పుట్టింది

వైసీపీ పార్టీ ఆవిర్భవించి మార్చి 12 నాటికి(బుధవారం) సరిగ్గా 15 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లి నివాసం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ప్రజల కష్టాల నుంచి పార్టీ పుట్టిందని, వారి గురించి పోరాడుతోందన్నారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు.

మూడు లేదా నాలుగేళ్లు తర్వాత మళ్లీ అధికారంలోకి

మనం చెప్పామంటే చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు వైసీపీ అధినేత. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లే స్థితిలో మన పార్టీ, కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొచ్చారు. మూడు లేదా నాలుగేళ్లు తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని నేతలను, కేడర్‌ని ఉత్సాహపరిచే మాటలు చెప్పారాయన. రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన జగన్‌, నేను విన్నాను.. నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts
అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ కేటీఆర్‌ చురకలు అంటించారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ Read more

డిసెంబర్ 5న కొలువుదీరనున్న మహారాష్ట్ర సర్కారు..?
The government of Maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో 'మహాయుతి' కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ Read more

హైకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబు
Mohan Babu lunch motion petition in the High Court

హైదరాబాద్‌: మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈక్రమంలోనే నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన Read more

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని
మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే Read more