हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే !!

Sudheer
తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే !!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొంత మేరకు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. పసిడి ధరలు గత కొన్ని రోజులుగా అస్థిరంగా మారటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజా తగ్గుదలతో బంగారం కొనుగోలు చేసేందుకు మళ్లీ ఆసక్తి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివాహ, శుభకార్యాల సీజన్ లో ధరలు స్వల్పంగా తగ్గడం గమనార్హం.

22 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గుదల

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గింది. తాజా మార్పులతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.80,200కు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.330 తగ్గి రూ.87,490గా నమోదైంది. గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పై పడింది.

బంగారాన్ని నిల్వ ఉంచుతున్న రిజర్వు బ్యాంకు..

వెండి రేటు రూ.1,000 తగ్గుదల

బంగారంతో పాటు వెండి ధరలో కూడా భారీ మార్పు కనిపించింది. వెండి ధర రూ.1,000 తగ్గడంతో ప్రస్తుతం 1 కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్ద స్థిరపడింది. వెండికి కూడ మంచి డిమాండ్ ఉండటంతో, ధర తగ్గడాన్ని వినియోగదారులు సానుకూలంగా స్వీకరిస్తున్నారు.

వివాహ శుభకార్యాల నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్

ప్రస్తుతం వివాహ, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం, వెండి కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నవరత్న ఆభరణాలు, బంగారు నాణేలు, వెండి వస్తువుల కొనుగోలు పెరుగుతుందని జువెలరీ వ్యాపారస్తులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆగమేఘాల మీద బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే, వచ్చే రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870