Smoke from the wildfires engulfing New York City

న్యూయార్క్ నగరాన్ని కమ్మేసిన కార్చిచ్చు పొగ

న్యూయార్క్: న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా కొన్ని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మధ్యాహ్నం 1 గంటకల్లా మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్‌ హోంప్టన్స్‌తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి.

Advertisements
న్యూయార్క్ నగరాన్ని కమ్మేసిన కార్చిచ్చు

గాలులు వీయడంతో దట్టమైన పొగ

మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను ఆర్పేశారు. ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. అయితే, స్థానికంగా ఉన్న గృహాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. ఇక న్యూయార్క్‌ గవర్నర్ హోచుల్ అక్కడ అత్యవసరస్థితిని ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. పొగ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts
టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విజేతగా ప్రజ్ఞానంద
Praggnanandhaa winner

ప్రఖ్యాత టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025 ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్‌లోని Wijk aan Zeeలో జరిగిన ఉత్కంఠభరిత టైబ్రేక్ మ్యాచ్‌లో Read more

Rodasi : రోదసిలో ఎక్కువ కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే
sunitha1

రోదసిలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ప్రభావంగా కండరాలు బలహీనపడటం, ఎముకలు దృఢత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు Read more

సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేది ఆరోజే
sunita williams2

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి రానున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో Read more

టర్కీ బాస్ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్‌లో పెళ్లి..
istockphoto 1186214696 612x612 1

పేరుకే వివాహం కానీ వీడియో కాల్‌లో పెళ్లి..టర్కీ బాస్, భారతీయ ఉద్యోగి వివాహ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది ఒక Read more

×