Srivari Teppotsavam from today

నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(మార్చి 09) రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

Advertisements
నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

తెప్ప అనగా పడవ, ఓడ

స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప‌చుట్టూ నీటిజ‌ల్లులు(ష‌వ‌ర్‌) ప‌డేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్స‌వాల్లో అలంక‌ర‌ణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది ఆధ్వ‌ర్యంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు.

చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారికి ఊరేగింపు

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

Related Posts
వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
Navya Haridas against Congr

కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ Read more

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ap assembly sessions

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి. చాలా కాలం తరువాత, ఈ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం Read more

కోళ్ల పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Raghuram and Ganta who went to the Kolla Pandem betting

అమరావతి: ఏపీలో సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందెలు, వాటిపై Read more

IPL 2025 : ముంబై అదిరిపోయే గేమ్ ప్లాన్.. ఫ్యాన్స్ ఖుషీ
miwin

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించడం వెనుక ఉన్న స్ట్రాటజీపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా పరుగుల వర్షం కురిసే వాంఖడే పిచ్‌పై Read more

×