Women are losing out politically.. MLC Kavitha

మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారు : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు పెట్టలేదని ప్రశ్నించారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని అన్నారు. ప్రతీ మహిళకు ఇస్తామన్న రూ.2500 హామీని అమలు చేసే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని కీలక ప్రకటన చేశారు.

Advertisements
మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారు  ఎమ్మెల్సీ

మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో ?

మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా?లేదా స్పష్టత ఇవ్వాలి. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు. మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉంది. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చాకలి ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉంది అని కవిత పేర్కొన్నారు.

Related Posts
Kadiri(AP) 2025 : కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం – ఆధ్యాత్మిక ఉత్సవ విశేషాలు
కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం 2025 ఆంధ్ర ప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, కదిరి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రముఖ హిందూ ఉత్సవం. ఈ ఉత్సవం శ్రీ Read more

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్
TDP High command Serious On

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ Read more

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత
SM Krishna passed away

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు Read more

రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్
ktr comments on congress government

హైదరాబాద్‌: రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నిర్ణయించారు. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న Read more

×