Tenth Hall Tickets Available Today

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సారి 10వ తరగతి పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్‌ షీట్‌ను ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. అడిషనల్‌ షీట్ ఇవ్వ‌రు. ఓఎంఆర్‌ షీట్‌ను తప్పులు లేకుండా సరిగా నింపాలని విద్యార్థులకు సూచించారు.

Advertisements
నేడు అందుబాటులోకి టెన్త్ హాల్

టెన్త్ క్లాస్‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ 2025 ఇదే..

.మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
.మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌
.మార్చి 24 – ఇంగ్లీష్‌
.మార్చి 26 – మ్యాథ్స్‌
.మార్చి 28 – ఫిజిక్స్‌
.మార్చి 29 – బయాలజీ
.ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌
.ఏప్రిల్‌ 3 – పేపర్‌-1 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)
.ఏప్రిల్‌ 4 – పేపర్‌-2 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)

మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు!

తెలంగాణలో 2024–25 నుంచి 10వ తరగతి ప‌బ్లిక్ పరీక్షల విషయంలో విద్యాశాఖ కీలకమైన మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికారు. మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. పరీక్ష హాల్లో విద్యార్థులకు ఇచ్చే ఆన్సర్‌ షీట్‌కు సంబంధించి కూడా మార్పులు చేశారు. కొత్త‌ విధానంలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇస్తారు. ఇందులోనే మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడిషనల్‌ షీట్ ఇవ్వ‌రు.

Related Posts
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి
Fire in Puppalguda.. Three killed

దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు Read more

ఆసుపత్రికి బుమ్రా: కోహ్లీకి కెప్టెన్సీ
ఆసుపత్రికి బుమ్రా: కోహ్లీకి కెప్టెన్సీ

సిడ్నీలోని SCG మైదానంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ రెండవ రోజు విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు Read more

అమెరికా-చైనా వాణిజ్య వివాదం…
US China 1

చైనా యొక్క ప్రభుత్వ మాధ్యమాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సరుకు పై అదనపు టారిఫ్‌లు విధించే మాటలు, ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల మధ్య Read more

అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. బుధువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకున్న బాబా..చంద్రబాబు ను కలిశారు. Read more

×