Kishan Reddy comments on cm revanth reddy

రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. ప్రజా తీర్పు.. కాంగ్రెస్‌ పాలనకు చెంపపెట్టులాంటిది.

Advertisements
రేవంత్‌ గాలి మాటలకు జవాబు

జీవో 317 కారణంగా ఇబ్బందులు

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కుల గణనపై విమర్శలు

కాగా, బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కుల గణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ ఫైర్​ అయ్యారు. కుల గణనలో పాల్గొనాలని కేసీఆర్ ను, కేటీఆర్​ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని నిలదీశారు. కుల గణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కుల గణనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Related Posts
సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌
drugs3

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ Read more

Bandi Sanjay : బండి సంజయ్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
mahesh sanjay

బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బండి సంజయ్‌కు నిజంగా దమ్ముంటే, ప్రధాని Read more

Hyderabad Metro: ప్రయాణికులకు మెట్రో మోత
Hyderabad Metro: ప్రయాణికులకు మెట్రో మోత

హైదరాబాద్ నగరంలో ప్రజలు రోజువారీ ట్రాఫిక్ భారం నుండి తప్పించుకోడానికి మెట్రో రైలును ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. వాహనాల రద్దీ, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, పెరుగుతున్న ఇంధన ధరలు Read more

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి
Congress MLA Medipalli Saty

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న సమయంలో, తెలంగాణలోని కరీంగనర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జరిగిన Read more

×