New ration cards to be issued from Ugadi onwards!

ఉగాది నుంచే కొత్త రేషన్‌ కార్డుల జారీ !

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్ ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఖరారు చేశారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డును తయారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాను ఖరారు చేశారు. రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Advertisements
ఉగాది నుంచే కొత్త రేషన్‌

రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు

ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో…కొత్త రేషన్ కార్డులు పొందేందుకు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు

ఈ ఏడాది మార్చి 30న ఉగాది పండుగ నిర్వహించుకోనున్నాం. ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 13 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

Related Posts
జెప్టో $300 మిలియన్ నిధులను సేకరించేందుకు ప్రణాళిక
zepto

ఇండియాలో ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ అయిన జెప్టో(Zepto) తన వ్యాపారాన్ని పెంచేందుకు $300 మిలియన్ నిధులను సేకరించాలనుకుంటోంది. ఈ నిధులు సేకరణ ద్వారా, జెప్టో భారతీయ Read more

రాజీనామా పై అవంతి శ్రీనివాస్‌ క్లారిటీ
Avanthi Srinivas clarity on resignation

అమరావతి: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామాకు గల కారణాలను ఆయన స్పష్టతనిచ్చారు. రాజకీయాల వల్ల కుటుంబానికి Read more

సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army recruitment rally

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్రా నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారికంగా ప్రకటన Read more

Tariffs : వివిధ దేశాలపై ప్ర‌తీకార సుంకాల‌ను ప్ర‌క‌టించిన డొనాల్డ్‌ ట్రంప్
ఎప్పటి నుంచి ట్రంప్ టారిఫ్స్ అమలయ్యేది?

Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ Read more

×