A family earned Rs. 30 crores at the Kumbh Mela.. CM

కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఓ కుటుంబం : సీఎం

లక్నో: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో మహా కుంభమేళా పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారని తెలిపారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై సీఎం సభలో స్పందించారు.

Advertisements
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన

దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం

పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు రూ.50వేల నుంచి రూ.52వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. అలా మొత్తంగా 130 పడవలతో రూ.30కోట్లు ఆర్జించారు అని యోగి వివరించారు. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు.

దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం

ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా కుంభమేళా నిర్వహించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. హోటల్‌ పరిశ్రమకు రూ.40వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33వేల కోట్లు, రవాణాకు రూ.1.5లక్షల కోట్ల మేర ఆదాయం లభించిందన్నారు. ఆర్థికంగా చూస్తే కుంభమేళా నిర్వహణ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5శాతం వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని సీఎం తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే.

Related Posts
ముద్ర లోన్ ఇక రెండింతలు..కేంద్రం ప్రకటన
mudraloan

కేంద్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండింతలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఇప్పటి Read more

రాహుల్ గాంధీపై మహిళ బీజేపీ ఎంపీ ఆరోపణ
రాహుల్ గాంధీపై మహిళ బీజేపీ ఎంపీ ఆరోపణ

నిరసన సందర్భంగా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ తనతో అనుచితంగా ప్రవర్తించారని, కాంగ్రెస్ నాయకుడి ప్రవర్తన తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ఓ మహిళా ఎంపీ ఆరోపించారు. నాగాలాండ్‌కు Read more

ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం
popes health still in danger

న్యుమోనియాతో పోరాడుతున్న పోప్ రోమ్‌: పోప్ ఫ్రాన్సిస్‌(88) ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ, ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్‌లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య Read more

కేటీఆర్‌ పై ఏసీబీ కేసు నమోదు
KTR responded to ED notices

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ Read more

×