Investigation against Rajini... Letter to Governor seeking permission

రజినీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ

అమరావతి: వైసీపీ నేత విడదల రజనీ , ఐపీఎస్ అధికారి పల్లో జాషువాల విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్‌ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది ప్రభుత్వం. దీనికి ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisements
image

ఏసీబీ విచారణకు ఆదేశం

శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ ఓనర్ లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు రూ.5కోట్లు డిమాండు చేసి రూ.2.20 కోట్లు వసూలు చేశారని అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్‌ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు

మరోవైపు కొన్ని రోజుల క్రితమే వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచరించిన హైకోర్టు.. విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నానంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Related Posts
పోసానికి వైద్యపరీక్షలు పూర్తి
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనంతరం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ కు తీసుకువచ్చిన పోలీసులు, అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ Read more

26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Trump agrees to extradite 26/11 Mumbai attack suspect

భారత్‌కు తహవూర్‌ రాణా అప్పగింత – కీలక ముందడుగు భీకర ముంబయి ఉగ్రదాడి మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు. అమెరికా అనుమతితో భారత్‌కు న్యాయపరమైన Read more

ఏపీలో భరోసా పింఛన్ల పంపిణీ
pention

ఏపీలో కూటమి ప్రభుత్యం వచ్చాక, ఎన్నికల హామీలో భాగంగా పేదలకు భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో Read more

కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు
కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వం 'ప్రజాగలం' కార్యక్రమంలో ఇచ్చిన హామీల ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు గణనీయమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర మంత్రివర్గం Read more

×