Singareni agreement with Rajasthan Power Department

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చారిత్రాత్మక ఒప్పందం చేసుకోనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజస్థాన్ లో ఎంఓయు జరగనుంది.

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి

1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం

ఈ భాగస్వామ్యంతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం కుదురనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సింగరేణి ఆర్థిక పరిపుష్టికి విస్తృత అవకాశాలు లభించనున్నాయి. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో, సింగరేణి జాతీయ స్థాయి కంపెనీగా గుర్తింపు పొందింది. మొత్తం పెట్టుబడిలో 74 శాతం సింగరేణి, 26 శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ (RVPNL) వాటాగా ఉండనుంది. తెలంగాణ ప్రభుత్వం, రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు

ఇకపోతే..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా తన కార్యకలాపాలను విస్తరిస్తూ, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, విద్యుత్ ఉత్పత్తిలో కూడా తన ప్రభావాన్ని చూపేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటూ పరిమితులను దాటే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.ఈ ఒప్పందం ద్వారా సింగరేణి విద్యుత్ ఉత్పత్తి రంగంలో తన ప్రభావాన్ని మరింత పెంచనుంది.

Related Posts
గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
Fire Accident HSAGAR

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్లో జరిగిన 'భారతమాతకు మహా హారతి' కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కార్యక్రమం Read more

2027 నాటికి భారత్లో భారీగా ఏఐ నిపుణుల కొరత
scientist female wearing vr headset interacting with virtual reality science lab interacting with virtual reality science chemistry technology generative ai

భారతదేశం వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఎదగడానికి అనువైన అవకాశాలు ఉన్నాయి. అధునాతన సాంకేతికత, డేటా విశ్లేషణ, మిషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో దేశీయ సంస్థలు Read more

ఎలాన్ మస్క్ & ట్రంప్: ‘DOGE’ తో అమెరికాలో కొత్త ఆర్థిక విప్లవం
trump musk 1 1024x731 1

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలి అయిన బిజినెస్ మాన్ ఎలాన్ మస్క్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. ట్రంప్ డొనాల్డ్, “DOGE” Read more

సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం
Minister Nara Lokesh meeting with Sales Force CEO Clara Shih

అమరావతి: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన లాస్ వెగాస్‌లో జరిగిన సినర్జీ సమ్మిట్‌లో Read more