హైదరాబాద్: రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ కీలక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..మోడీని కలసి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మెదలు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. మోడీ ఏజంట్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ బాంబ్ పేల్చారు. మోడీని కలసొచ్చాక కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ దాడి తీవ్రతరం చేశాడని చురలకు అంటించారు.

మోడీ భజన చేస్తూ..
కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయితీ మోడీ ఏ టీం, మోడీ బీ టీం మాదిరి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మోడీతో రహస్య ఒప్పందం చేసుకుని వచ్చాడని వెల్లడించారు. రాహుల్ గాంధీకి అర్థం అవుతుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. మోడీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతదా ? మోడీ భజన చేస్తూ.. రేవంత్ బహిరంగంగా దొరికిపోతున్నాడన్నారు. పదవి, ఆస్తులు కాపాడుకోవటానికే రేవంత్ మోడీ భజన చేస్తున్నాడని ఆగ్రహించారు. హరీష్ రావుపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా?
కాగా, పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా? అని కేటీఆర్, హరీశ్ రావు, కవితపై మండిపడ్డారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రధాని మోడీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రాలేదు.. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోడీనేనా అని రేవంత్ ప్రశ్నించారు.