Inter exams start from today

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..!

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసివేసారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. కాగా జనరల్‌, ఓకేషనల్‌ కలిపి మొత్తం 26,161 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 12,936 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,225 మంది ఉన్నారు.

Advertisements
 నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్‌ పరికరాలపై ఆంక్షలు

పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు. కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కూడా సెల్‌ఫోన్‌లను పరీక్ష కేంద్రాల ప్రాంగణంలో వినియోగించకుండా ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్ర చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ ఆఫీసరు మాత్రమే ఇంటర్‌ బోర్డు అందించిన కీప్యాడ్‌ సెల్‌ఫోన్‌ను వినియోగించాలి. ఇంటర్మీడియట్‌ రాత పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీస్‌ అధికారులు నిర్వహించాల్సిన విధుల గురించి ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. విద్యార్థులను సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జెరాక్స్‌ షాపులను మూసివేయించాలన్నారు.

Related Posts
Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ
Bill Gates meets Sachin Tendulkar

Sachin Tendulkar: భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ గురువారం నాడు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా Read more

Dokka Seethamma: ‘డొక్కా సీతమ్మ’ జీవిత కథ పై సినిమా
Dokka Seethamma: 'డొక్కా సీతమ్మ' జీవిత కథ పై సినిమా

ఆంధ్రుల అన్నపూర్ణ జీవిత కథ వెండితెరపై ప్రముఖ దాత డొక్కా సీతమ్మ జీవిత గాధ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. టీవీ రవినారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ Read more

Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: కాంగ్రెస్

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘాటిస్తూనే Read more

ప్రధాన మంత్రి మోదీ నైజీరియా పర్యటన: 3 కీలక ఒప్పందాలు సంతకం
nigeria 1

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాకు పర్యటించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబుతో సమావేశమైన ఆయన, రెండు ప్రజాస్వామ్య Read more

×