हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.

Anusha
ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.

జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ పన్ను బకాయిలపై ఉక్కుపాదం మోపుతోంది. మొండి బకాయిదారులపై కొరడా ఝళిపిస్తూ చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా (మార్చి 31) రూ.2 వేల కోట్లు వసూలు చేయాలనే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఆస్తుల సీజ్

పన్ను బకాయిలు చెల్లించని వారికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రూ.6 లక్షలకు పైగా బకాయిలున్న యజమానులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అప్పటికీ స్పందించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు.

భవనాలపై ప్రత్యేక నిఘా

నివాస భవనాల పేరుతో అనుమతి తీసుకుని, వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న భవన యజమానులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. పన్ను మినహాయింపులను దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.

1832908 ghmc

ప్రభుత్వ భవనాలు

పన్ను బకాయిలను కేవలం వ్యక్తిగత భవన యజమానులకే పరిమితం చేయకుండా, ప్రభుత్వ భవనాలు కూడా బకాయి ఉందని జీహెచ్ఎంసీ గుర్తించింది. సుమారు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులపై బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ భవనాల యాజమాన్య సంస్థలకు కూడా నోటీసులు పంపి, పన్ను చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

వన్ టైమ్ సెటిల్మెంట్

బకాయిలను తీర్చేందుకు కొన్ని పెద్ద భవన యజమానులు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్) కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఒకే విడతలో తగ్గింపు ఇచ్చి పన్ను వసూలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, జీహెచ్ఎంసీ మరింత కఠినంగా వ్యవహరిస్తూ, నిర్దిష్ట గడువులోపు పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది.జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లు వసూలు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 1500 కోట్లకు పైగా వసూలు చేయగా, మిగిలిన రూ.500 కోట్ల కోసం నివాస మరియు వాణిజ్య భవన యజమానులపై కఠిన చర్యలు చేపడుతోంది. పన్ను ఎగవేసే వారిపై అధిక జరిమానాలు, ఆస్తుల సీజ్ చర్యలు తీసుకుంటూ వేగంగా ముందుకు సాగుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870