Minister key points on the Pune rape incident

పుణె అత్యాచార ఘటన పై మంత్రి కీలక విషయాలు

ఎదుటివారిని ఆకట్టుకునేందుకు చాలా నీట్‌గా రెడీ

పుణె: మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్ పుణె అత్యాచార ఘటన పై స్పందించారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 9 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే అర్ధగంటలో నిందితుడు ఎవరో గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని ట్రాక్ చేశాం. ఘటన తర్వాత అతడు బస్సులో వెళ్లిపోయాడు. అతడు గత నాలుగైదు రోజులుగా ఏం చేశాడో తెలిసింది. దురుద్దేశంతోనే పలు బస్టాండ్‌లకు వెళ్లాడు. అప్పుడు అతడు చాలా నీట్‌గా రెడీ అయ్యాడు. ఇన్‌షర్ట్‌ చేసుకున్నాడు. ఎదుటివారిని ఆకట్టుకునేందుకు అతడు అలా ప్రవర్తించివుండొచ్చు.

పుణె అత్యాచార ఘటన పై మంత్రి

అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు

కాగా.. అత్యంత రద్దీగా ఉండే బస్‌ స్టేషన్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్‌ స్టేషన్‌లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్‌ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.

రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలు

బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్‌ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

Related Posts
పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
pawan lokesh

బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు Read more

గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన
గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ రోజు, మార్చి 3, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిర్ అడవుల్లోని ఆసియా Read more

ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి
4line highway line Ap

తిరుమల వెళ్లే వారికీ గుడ్ న్యూస్ తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. Read more

ఓ పార్టీలో ట్రంపును కలిసిన అంబానీ జంట
trump and muskesh couple

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత Read more