India reacts strongly to Pakistan accusations

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌

మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్‌ లేదు..

జెనీవా : దాయాది దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తన అక్కసు వెల్లగక్కింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది. అంతేకాక.. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి పాక్‌ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్‌ తరార్‌ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి దీటుగా స్పందించారు.

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన

ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది

కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్‌ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంది.

తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి

ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్‌ దృష్టిసారిస్తుంది. ఆ దేశం మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి అని త్యాగి పేర్కొన్నారు. ఇక, ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతామండలి సమావేశంలోనూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషక్‌ దార్‌ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీనికి సైతం భారత్‌ ఘాటుగా స్పందించింది. జైషే మహమ్మద్‌ వంటి సంస్థలను ప్రోత్సహించే పాక్‌.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం అత్యంత హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేసింది.

Related Posts
ఒప్పందం చేసుకుని ఉంటే యుద్ధం జరిగేది కాదు: ట్రంప్
ఒప్పందం చేసుకుని ఉంటే యుద్ధం జరిగేది కాదు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించినందుకు ఆయనను నిందించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత దాదాపు Read more

రాజధానిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
Affidavit of AP Govt in Supreme Court on capital

అమరావతి: అమరావతి నిర్మాణం చుట్టూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా Read more

రిపబ్లిక్ డే పరేడ్ కు తెలంగాణ నుంచి 41 మంది
republic day delhi

న్యూఢిల్లీలో కర్తవ్యపథ్ వద్ద నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి 41 మంది ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ప్రతినిధుల్లో సంక్షేమ కార్యక్రమాల Read more

నవంబర్ 09 న విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగం
Andhra Pradesh Tourism Sea

విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్’ సర్వీసును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న శ్రీకారం చుట్టబోతున్నారు. డీ హవిల్లాండ్ కంపెనీ Read more