हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తమిళులకు అమిత్ షా క్షమాపణలు

Anusha
తమిళులకు అమిత్ షా క్షమాపణలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళాన్ని మాట్లాడలేకపోవడం పట్ల తమిళ ప్రజలను క్షమించాల్సిందిగా కోరారు. ఇది ఆయనకు తమిళ భాష, సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది.అయితే, జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా నిలబడుతోంది. ఇలాంటి సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎన్డీయే కూటమి

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రజల మద్దతుతో తమిళనాడులో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు.2024 సంవత్సరం బీజేపీ కోసం చారిత్రకంగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టడం, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం వంటి సంఘటనలు భారత రాజకీయాల్లో బీజేపీ స్థైర్యాన్ని పెంచాయని వివరించారు. అంతే కాకుండా, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీపై విశ్వాసం ఉంచారని తెలిపారు.

20241104092227 Amit Shah PTI

తమిళనాడులో డీఎంకే పార్టీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, అవినీతిని పెంచుతోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవినీతి అంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని, కుటుంబ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం చేకూర్చేందుకు కృషి చేస్తోందని అన్నారు.

తమిళనాడులో హిందీ అమలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానం మేరకు తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే తమిళనాడులో హిందీకి అనుమతించే ప్రసక్తే లేదని అక్కడి డీఎంకే ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఓ రకంగా మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమంతో డీఎంకే రాష్ట్రంలో మరింత రాజకీయ బలం పుంజుకుంటోంది.తమిళనాడులో ఇటీవల రచ్చ రేపుతున్న అంశం హిందీ అమలు. ఎన్ఈపి మేరకు త్రిభాషా విధానానికి కట్టుబడి రాష్ట్రంలో ఖచ్చితంగా హిందీ అమలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది కేంద్రం. అందుకు ఛాన్సే లేదు.. హిందీ భాషను అంగీకరించే ప్రసక్తే లేదంటోంది తమిళనాడులోని డిఎంకె సర్కార్. అయితే ఈ వ్యవహారంలో అందరూ రెండు విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఒకటి గెట్ అవుట్ నినాదం.. తమిళనాడులో రెగ్యులర్‌గా వినబడుతున్న మాట.. ఎక్కడా లేని విధంగా అక్కడే ఎందుకు ఈ మాట పదే పదే వినబడుతోంది? ఇక రెండోది.. హిందీ వ్యతిరేక ఉద్యమం.. తమిళనాడులో డిఎంకె పార్టీ 9 దశాబ్దాల క్రితం బలమైన పునాదులు వేసుకుంది ఈ హిందీ వ్యతిరేక ఉద్యమంతోనే.. రాజకీయంగా తమిళ గడ్డపై సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇదే అంశంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870