సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెలుగు సినిమా ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలలో ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులకు కుటుంబ విలువలు, అనుబంధాలను గుర్తు చేసేలా సాగే అందమైన కథను తెరపై చూపించింది. అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో, ఓ కుటుంబ కథను హృద్యంగా మలిచిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ చిత్రంలో వెంకటేష్ పెద్దన్నయ్యగా, మహేష్ బాబు తమ్ముడిగా కనిపిస్తారు. వెంకటేష్ పాత్రకు మల్లికార్జున అనే పేరు, మహేష్ పాత్రకు సీతా రామరాజు అనే పేరు పెట్టాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తొలుత అనుకున్నా, కథలో అంజలి పాత్ర పేరు సీత కావడం వల్ల కన్‌ఫ్యూజన్ వస్తుందనే ఉద్దేశంతో చివరికి పెద్దోడు-చిన్నోడు అని వ్యవహరించేలా మార్చారు. మరోసారి వీరిద్దరికి రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు పెడదాం అని కూడా అనుకున్నారట.
నటీ నటులు
ఈ సినిమాలో సమంత, అంజలి, జయసుధ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అభినయ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మహేష్ బాబు కామెడీ టైమింగ్, వెంకటేష్ సహజమైన అభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా పాటలు కూడా బాగా ప్రజాదరణ పొందాయి.దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాల ఊహల్లోకి తీసుకెళ్లేలా సాగుతుంది. కుటుంబ విలువలు, సోదరుల మధ్య అనుబంధం, ప్రేమ, గౌరవం, బాధ్యతలను చిత్రీకరించడం ఈ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు అదే ఇష్టంతో చూస్తుండటమే దానికి నిదర్శనం.

రీ-రిలీజ్
హిట్ మూవీ రీ-రిలీజ్ అవుతున్న వార్త మహేష్ బాబు, వెంకటేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. మార్చి 7న ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. థియేటర్‌లో మళ్లీ చూడాలని ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పాన్ గ్లోబల్ మూవీ . ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు. సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
తెలుగు చిత్రసీమలో కుటుంబ అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన గొప్ప చిత్రాల్లో ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సమంత, అంజలి కథానాయికలుగా అలరించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కుటుంబ విలువలు, సోదరాభిమానాన్ని ప్రదర్శించే ఓ అనుభూతి పరచే కథను ప్రేక్షకులకు అందించింది.