Sri Grishneshwar Jyotirling

సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఎక్కడ ఉందొ తెలుసా..?

హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జ్యోతిర్లింగాల్లో మహారాష్ట్రలోని ఘృష్నేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదిగా గుర్తించబడింది. ఈ పవిత్ర స్థలం భక్తులకి అత్యంత శ్రద్ధాసక్తులతో కూడిన దర్శన స్థలంగా మారింది. ఇక్కడ శివుని దర్శనం చేసుకునే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే, ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

Advertisements
Sri Grishneshwar
Sri Grishneshwar

భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రత్యేక్షం

స్థల పురాణం ప్రకారం, శివుడిని అత్యంత భక్తితో పూజించే ఒక మహిళ కుమారుణ్ని కొందరు కొలనులో పడేస్తారు. దాంతో బాలుడు ప్రాణాలు కోల్పోతాడు. అయినప్పటికీ, ఆ మహిళ తన భక్తిని కోల్పోలేదు. ఆమె నిరంతరం భగవంతుడిని ప్రార్థిస్తూ, నిత్య నైవేద్యంతో శివారాధన చేస్తుంది. ఆమె భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఆమె కుమారునికి ప్రాణం పోసి తిరిగి జీవితం అందిస్తాడు.

జ్యోతిర్లింగరూపంలో వెలిసింది

భక్తురాలి కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగరూపంలో వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే, సంతానయోగం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, పిల్లల కోసం ప్రార్థించే వారికి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. కాబట్టి, సంతాన ప్రాప్తిని కోరికతో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.

Related Posts
ప్యాసెంజర్ సంఖ్య తగ్గడంతో, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి విమానాలు రద్దు..
జెడ్డా-అహ్మదాబాద్ విమానంలో బాంబు బెదిరింపు

బంగ్లాదేశ్ విమాన సంస్థలు ఈమధ్య కాలంలో ఇండియా నుండి వచ్చే మరియు ఇండియాకు ప్రతి రోజు వెళ్లే విమానాలను రద్దు చేయడం మొదలుపెట్టాయి. ప్యాసెంజర్ సంఖ్య గణనీయంగా Read more

Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌
Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌

దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగబోయే విశ్వ క్రీడల్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ నిర్వహించనున్నారు. అయితే ఈ క్రికెట్ పోటీల్లో Read more

కేటీఆర్‌పై కేసు నమోదు
KTR responded to ED notices

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు Read more

చిరంజీవిని కలిసిన నాగార్జున
Nagarjuna meet Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరిగే ఏఎన్‌ఆర్‌ అవార్డుల వేడుకకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఈ ఫొటోలను తన Read more

×