హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

BJP గురించి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

Advertisements

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల.కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. BRS ను నమ్మరు. ఇద్దరినీ చూశాం ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారు.

ప్రజల బాధలు

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పాలన మీద మాట్లాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటే.

రేవంత్ రెడ్డి పై ఎటాక్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి.. రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు.

రాజకీయాలు: పూల బాట కాదని తెలిపిన ఈటల

అనేక బాధలుంటాయి అన్నింటిని దిగమింగుకోవాలి. దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడు. సమస్య వస్తే పారిపోయేవాడు లీడర్ కాదు. రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాట.

ఇతరు రేఖలతో పని చేస్తున్న వాడిని

నేను 365 రోజులు 24 గంటలు పనిచేసే వాడిని. నాకు సెలవలు లేవు. జ్వరం వచ్చిందని పడుకున్న సందర్భాలు లేవు. – ఈటల రాజేందర్.

హుజురాబాద్ లో గెలుపు కోసం చేసిన ప్రకటన

ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించమని కోరేందుకు మీదగ్గరకు వచ్చా. ఈ గెలుపు రేపటి గెలుపుకు నాంది పలకాలి.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల.

హుజురాబాద్: నా గడ్డ

హుజురాబాద్ నా గడ్డ : నాకు వచ్చిన అతికష్టకాలంలో నాకు అండగా నిలబడ్డది హుజురాబాద్ గడ్డ. కన్నీళ్ళకు కరిగిపోయారో.. మోసపు మాటలకు కరిగిపోయారో అయిపోయింది. జరిగింది జరిగిపోయింది. జరిగినది మన మంచికే అనుకోవాలి.

ప్రజల విశ్వాసం పై నమ్మకం

స్థానిక సంస్థల ఎన్నికలలో మీ గెలుపు కోసం నేను వచ్చి ప్రచారం చేస్తాను. హుజూరాబాద్ ప్రజలు నా మాట వింటారని నమ్మకం ఉంది.

సమస్యలను అధిగమించడం

అనేక బాధలుంటాయి అన్నింటిని దిగమింగుకోవాలి. దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడు. సమస్య వస్తే పారిపోయేవాడు లీడర్ కాదు. రాజకీయాలు పూలబాట కాదు ముల్లబాట. మన మీద జరుగుతున్న కుట్రలన్ని ప్రజల గమనిస్తున్నారు. అన్ని చూసి ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారు. ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. వారితో కలిసి నడవాలి.

ఎన్నికల కోసం కృషి చేస్తాం

వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి ప్రతి ప్రజాప్రతినిధిని గెలిపించుకునే బాధ్యత నాది. నా ఎన్నికలో ఎలా పనిచేస్తానో మీ ఎన్నికలకు కూడా అలానే పని చేస్తానని మీ అందరికీ తెలుసు. యువకులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాం. నాట్ పాజిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు.

నా జీవితంలో సెలవులు లేవు

నా జీవితంలో హాలిడే అనే పదం లేదు. నా జీవితంలో మధ్యాహ్నం పూట పడుకున్నది లేదు. నా జీవితంలో జ్వరం వచ్చిందని సెలవు తీసుకున్నది లేదు. 365 రోజులు 24 గంటలు మిషన్ లెక్క పని చేసే మనిషిని. నన్ను నడిపిస్తున్నది, నాశక్తి, నా వయసు కాదు, ప్రజల స్ఫూర్తి. ప్రజల అవసరం నన్ను నడిపిస్తుంది.

మల్కాజిగిరి ప్రజల పట్ల బాధ్యత

మొన్న నన్ను గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలను కూడా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. సగం హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటుంది. 29 రాష్ట్రాల ప్రజలు ఉండే మినీ ఇండియా మల్కాజిగిరి. పేదవాళ్ళ అడ్డా కూడా అదే. అనేక రకాల సవాళ్లు ఉన్నాయి.

రేవంత్ రెడ్డి పై మరో ఎటాక్

రేవంత్ రెడ్డికి దమ్ములేదు, కాంగ్రెస్ కు ముఖం లేదు : ప్రజాక్షేత్రంలో సంపూర్ణంగా వెలిసిపోయిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డే మా చివరి సిఎం అనుకుంటున్నారు.

ఎన్నికల హామీలపై విమర్శ

సీఎం సభ పెడితే… సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారనుకుంటాం. కానీ 317 GO సవరిస్తా అనో, ఐదు డి.ఏ లు విడుదల చేస్తామనో, హెల్త్ కార్డులు ఎప్పటిలోగా ఇస్తారు అనే స్పష్టతనో, CPS రద్దు గురించో చెప్తాడని భావించాము.. కానీ ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు.

విద్యార్థుల సమస్యలు

రిటైర్డ్ అయితే ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎనిమిది శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. వీటి గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు.

BRS లేకుండా టీచర్ల సమస్యలు

టీచర్ ఎమ్మెల్సీగా పలానా అభ్యర్థికి ఓటు వేయాలని కోరే ముఖం కాంగ్రెస్ సు లేదు. BRS కి అభ్యర్థి లేడు. KGBV టీచర్ల బాధలు, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు, మోడల్ స్కూల్ ఉద్యోగులకు కనీసం హెల్త్ కార్డు లేకపోవడం అనేక సమస్యలున్నాయి.

ప్రైవేట్ కాలేజీల సమస్యలు

ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్లలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను 2021 నుంచి పెండింగ్లో పెట్టింది. డబ్బులు ఇవ్వమని సిఎం దగ్గరికి పోతే.. సెటిల్మెంట్ చేసుకుందామంటూ జోకులు వేస్తున్నారట.

ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డమని కన్నీళ్లు పెడుతున్న పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నాం.

BJP ఎల్లప్పుడూ టేచర్ ప్రొటెక్షన్ చేస్తుంది

టీచర్ల గ్రాడ్యుట్ల సమస్యల మీద కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం మీద అంకుశంతో పొడిచి మేల్కొల్పే సత్తాఉన్న పార్టీ బిజెపి ఒక్కటే.

రాముడు దైవవిషయంలో గెలిచారు

15 నెలలుగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. ఆర్ గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పనులు చేస్తానంటూ.. మాటల గారడీ చేసి గెలిచారు.

నిరుద్యోగ సమస్యపై బీజేపీ చర్యలు

నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు 2024-25 కేంద్ర బడ్జెట్లో పెట్టారు. గంభీరమైన సమస్యను గుర్తించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు.

ప్రముఖ యువతకు బీజేపీ సపోర్ట్

యువకుల్లారా నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నాను… మీరు అనేక మందిని చూశారు.. వారు చేసిందేంటో చూశారు. అక్కడ మీకోసం తపించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.

ప్రతి ఇంటికి బీజేపీ హామీలు

12 లక్షల రూపాయల ఇన్కమ్ టాక్స్ రాయితీ కల్పించి మధ్యతరగతి ఉద్యోగులకు లాభం చేసేలా చేసింది కేంద్ర ప్రభుత్వం.

ప్రజల మనోభావాలు

కెసిఆర్ కి అవకాశం ఇచ్చాము.. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చాము.. ఇక ఈసారి అవకాశం బీజేపీకి అని ప్రజలంతా అంటున్నారు.

హుజురాబాద్ లో బీజేపీ విజయం

బిజెపి ఎక్కడ ఉంది అని అడిగిన వారికి హుజురాబాద్లో లక్షా ఏడువేల మెజారిటీ ఇచ్చి గెలిపించారు.

ముఖ్యంగా BRS నిరాశ

ఈ 15 నెలలుగా ప్రజల సమస్యల మీద కోట్లాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.

ప్రజలే చివరి తీర్పు

ప్రజల అభిప్రాయాన్ని గమనిస్తాం.

Related Posts
కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్టు ఇదే – బండి సంజయ్
bandi sanjay revant

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు కీలక స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ Read more

సీఎం ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ Read more

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఈడీ నోటీసులు
ED notices to former MLA Marri Janardhan Reddy

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులోని రూ. 1000 కోట్లకుపైగా విలువైన భూదాన్ భూములను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ప్రైవేటు పరం చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. Read more

SLBC టన్నెల్లో రోబోలతో సెర్చ్ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, Read more

×