If we want to become a fit and healthy country, we have to deal with the problem of obesity.. Prime Minister

ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే.. ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి : ప్రధాని

10 మంది ప్రముఖులను నామినేట్‌ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఊబకాయం సమస్య గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్‌ చేశారు. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయని ప్రధాని తెలిపారు.

Advertisements
ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే

గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు

ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం కేసులు పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. “ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే.. మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. మరింత ఆందోళనకర విషయం ఏంటంటే..? పిల్లల్లో ఊబకాయ సమస్య నాలుగు రెట్లు పెరిగింది” అని ప్రధాని మోడీ తెలిపారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారన్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలి

ఇది చాలా ఆందోళనకర అంశమని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని సూచించారు. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోడీ నామినేట్‌ చేశారు.

Related Posts
BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నవారు వీరేనా?
BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో ఉన్నది వీరే?

తెలంగాణ బీజేపీలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం Read more

చైనా “ప్రేమ విద్య” ద్వారా యువతలో మంచి దృక్పథాలను పెంచాలనుకుంటున్నదా?
China Medical University

చైనా వివాహం, ప్రేమ, సంతానం మరియు కుటుంబం పై సానుకూల దృక్పథాలను పెంచేందుకు "ప్రేమ విద్య"ను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ఈ చర్య దేశంలోని జనాభా పెరుగుదలని Read more

గర్భిణులు బాలింతలు జాగ్రత్త
గర్భిణులు బాలింతలు జాగ్రత్త

గర్భిణులు బాలింతలు జాగ్రత్త.ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, బాలింతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు, మెసేజెస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. 'జనని సురక్ష యోజన' పథకం ద్వారా Read more

Suicide: జార్ఖండ్ లో..ఘోరం ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది

జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లాలోని మహేశ్‌లిటి గ్రామంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. తండ్రి ముగ్గురు పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం Read more

×