'మ‌జాకా' ట్రైల‌ర్ చూశారా

‘మ‌జాకా’ ట్రైల‌ర్ చూశారా

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మజాకా’ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. సందీప్ కిషన్ మాస్, క్లాస్ మిక్స్ అయిన పాత్రలో కనిపిస్తుండగా, ఆయన తండ్రి పాత్రలో రావు రమేశ్ అదరగొట్టారు.ఈ ట్రైలర్ చూస్తుంటే, సినిమా మొత్తం తండ్రి-కొడుకుల లవ్‌స్టోరీ, పెళ్లి, ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. రావు రమేశ్ ఒక క్లాస్ తండ్రిగా, సందీప్ కిషన్ ఒక మాస్ అబ్బాయిగా కనిపించారు. ట్రైలర్‌లోని కొన్ని కామెడీ సీన్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్‌లో హైలైట్ సీన్స్:

రావు రమేశ్, సందీప్ కిషన్ తండ్రి-కొడుకు కామెడీ
రావు రమేశ్, తన లవ్ ట్రాక్‌కి అడ్డుగా నిలబడితే బాగా నవ్వించే డైలాగ్స్
రీతూవర్మ, అన్షు అంబానీ
క్లైమాక్స్ లో బాలయ్య బాబు రిఫరెన్స్ – ‘జై బాలయ్య’ డైలాగ్

‘మజాకా’ సినిమాలో రీతూవర్మ కథానాయికగా నటిస్తుండగా, 2002లో ‘మన్మధుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అన్షు అంబానీ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, , గ్లామర్ టచ్ సినిమా హైలైట్ అవ్వొచ్చని అనిపిస్తోంది.సినిమాలో తండ్రి, కొడుకు ఇద్దరూ ప్రేమలో పడితే ఏం జరుగుతుందో వినోదభరితంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సందీప్ కిషన్ లవ్ స్టోరీ నడుస్తుంటే, మరోవైపు రావు రమేశ్ కూడా ప్రేమలో పడటం సినిమాలో ఆసక్తికరమైన మలుపు అని ట్రైలర్‌లో స్పష్టమైంది. తండ్రి, కొడుకు ఇద్దరికీ తమ ప్రేమను నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి హాస్యసన్నివేశాలు పండబోతాయి? అనేదే కథలో మేజర్ ట్విస్ట్‌గా అనిపిస్తోంది.

ఫిబ్రవరి 26న థియేటర్లలో

‘మజాకా’ ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. మహాశివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న థియేటర్లలో సందడి చేసేందుకు ‘మజాకా’ సిద్ధమైంది!

ఈ సినిమాకు కథ, మాటలు ప్రసన్న బెజవాడ అందించగా, దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన తన స్టైల్ కామెడీ టచ్‌ ఇచ్చారు.

దర్శకుడు: త్రినాథ్ రావు నక్కిన
కథ, మాటలు: ప్రసన్న బెజవాడ
సంగీతం: లియోన్ జేమ్స్
నిర్మాత: రాజేశ్ దండా (ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్)
హీరో: సందీప్ కిషన్
హీరోయిన్లు: రీతు వర్మ, అన్షు అంబానీ
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 26, 2025 (మహాశివరాత్రి సందర్భంగా)

ట్రైలర్ చివర్లో బాలయ్య బాబు రిఫరెన్స్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మ్యాన్షన్ హౌస్ తీసుకొచ్చి బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.జై బాలయ్య అనాలి” అనే డైలాగ్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో నవ్విస్తోంది. బాలయ్య అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.

Related Posts
దిస్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ
దిస్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ

తమిళ నటుడు శరత్ కుమార్ కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం ది స్మైల్ మేన్ డిసెంబర్ 27, 2023న థియేటర్లలో విడుదలై, తాజాగా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ Read more

రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్ విడుదల
రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్ విడుదల

శ్రీకాంత్ తనయుడు రోషన్ టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ ఇచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని ‘పెళ్లిసందడి’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మరో Read more

హెబ్బా వయ్యారాలు మాములుగా లేవుగా..
heeba patel

అందాల తార హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ Read more

పుష్ప 2 రీలోడేడ్ ప్లాన్ హిట్ అయిందా లేదా?
pushpa 2

పుష్ప 2 రీలోడెడ్ ప్లాన్ మేకర్స్‌కు సక్సెస్‌ను అందిస్తుందా? 43 రోజుల తరువాత థియేటర్స్‌లోకి వచ్చిన ఈ కొత్త వెర్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతకాలంగా కలలు Read more