రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.

రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ టీమ్ లు తలపడనున్నాయి. టిక్కెట్లు ఇప్పటికే భారీగా అమ్ముడుపోయాయి, అంటే రేపటి మ్యాచ్ కోసం దుబాయ్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది.

పాకిస్థాన్‌కు కీలక సమరం

ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన ఆతిథ్య పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ అవకాశాలు బలపడతాయి. మరోవైపు, భారత జట్టు బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులతో తన ఫామ్‌ను ప‌ర్వాలేద‌నిపించాడు, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భీకరమైన ఫామ్‌ను కొన‌సాగిస్తూ శ‌త‌కం బాదాడు.

 యువ‌రాజ్ సింగ్ వ్యాఖ్య‌లు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి పరుగులు రావడం మొదలైతే అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. రోహిత్‌, కోహ్లీల‌కు ఫామ్‌తో ప‌నిలేద‌ని, వ‌న్డేల్లో వారిద్ద‌రూ మ్యాచ్ విన్న‌ర్లేన‌ని తెలిపాడు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా, పరుగులు చేయడం మొదలుపెడితే ప్రత్యర్థి జట్టు చిక్కుల్లో పడక తప్పదు.  నేను ఎల్లప్పుడూ మ్యాచ్ విన్నర్లకు మద్దతు ఇస్తాను. వన్డే క్రికెట్‌లో ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్లలో విరాట్ కోహ్లీతో పాటు అతను బ్యాట‌ర్‌గా భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్. అతను 60 బంతుల్లో సెంచరీ సాధించగలడు. కేవలం ఫోర్లే కాదు, సిక్సర్లతోనే పరుగులు రాబట్టగల సామర్థ్యం ఉంది. హుక్ షాట్లు, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సత్తా ప్రపంచ స్థాయిలో ఉన్న క్రికెటర్లలో రోహిత్ ఒకడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్యే ఉంటుంది, ఒకసారి సెట్లోకి వస్తే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగలడు.

rohit sharma 696x497

కేవలం ఫోర్లే కాదు సిక్సర్లతోనే ర‌న్స్ రాబ‌ట్టేస్తాడు. షార్ట్ పిచ్ బంతుల‌ను అద్భుతంగా ఆడ‌గ‌ల‌ అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ ఒకడు. అలాగే 145-150 కి.మీ. వేగంతో వ‌చ్చే బంతిని కూడా అల‌వోక‌గా హుక్ చేసి బౌండ‌రీ దాటించే సామర్థ్యం అత‌ని సొంతం.అతని రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడని యువరాజ్ సింగ్ జియో హాట్‌స్టార్‌లో మాట్లాడుతూ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (23న) భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. 

Related Posts
Ravichandran Ashwin: కివీస్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ ఖాతాలో అరుదైన రికార్డ్
kiwis

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు అశ్విన్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా Read more

18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే
syed mushtaq ali trophy

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో అరుణాచల్ ప్రదేశ్ మరియు జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో అరుణాచల్ Read more

IPL 2025: ఐపీఎల్ ఆటగాళ్లకి పన్ను చిక్కులు: చేతికి వచ్చేది ఎంత!
ఐపీఎల్ ఆటగాళ్లకి పన్ను చిక్కులు: చేతికి వచ్చేది ఎంత!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ తాజాగా ప్రారంభమైన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈసారి ఊహించని విధంగా IPL ప్లేయర్స్ వేలం కోట్లలో Read more

TSRTC : ఐపీఎల్ అభిమానులకు శుభవార్త : ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు
TSRTC ఐపీఎల్ అభిమానులకు శుభవార్త ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు

TSRTC : ఐపీఎల్ అభిమానులకు శుభవార్త : ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు క్రికెట్ ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ Read more