Hearing of Vallabhaneni Vamsi bail petition adjourned..!

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..!

బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ తీర్పును సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీ బెయిల్ పిటిషన్‌ను కూడా మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో వంశీ బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ , ఎస్టీ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది.

Advertisements
image

కస్టడీ కోసం పిటీషన్..

కాగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

బెయిల్ నిరాకరణ..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరిచింది.

Related Posts
Krishna District: బాలిక పై సామూహిక లైంగికదాడి
బాలిక పై సామూహిక లైంగికదాడి

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడిన Read more

ఏపీలో బాణసంచా ప్రమాదాలు… ముగ్గురి మృతి
Fireworks accidents in ap

ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన బాణసంచా ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరులో జరిగిన ఘటనలో, బైక్‌పై టపాసులు Read more

TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల Read more

Show cause notices : రామానాయుడు స్టూడియోకు షోకాజ్‌ నోటీసులు
Show cause notices issued to Ramanaidu Studios

Show cause notices : ఏపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 Read more

×