Harish Rao Questions CM Revanth Reddy

ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే : హరీశ్ రావు ట్వీట్

రేవంత్ రెడ్డి ఈ రైతుకు ఏం జవాబిస్తారు?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనేది కట్టుకథే అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఓ రైతు నిరసనకు దిగిన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారు.

 

ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే..

మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు..అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఈరోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు,రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తరు.

హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలి

ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు. అధికారులను వేడుకున్నడు. అయినా, వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి గారి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం అని హరీశ్ రావు రాసుకొచ్చారు.

Related Posts
ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: హరీష్ రావు
Harish Rao stakes in Anand

Harish Rao congratulated Bathukamma festival హైదరాబాద్‌: పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ Read more

ఇఫ్తార్ విందు ఇచ్చిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్
Vijay hosted an iftar dinne

తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. Read more

జైలులో పోసానికి అస్వస్థత
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

జైలులో పోసానికి అస్వస్థత అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న జైలు అధికారులు ఆయనను Read more

ఇక ఏక్కడైనా సెల్ ఫోన్ సిగ్నల్
phone signal

ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా వీడియో కాల్ ద్వారా ఆత్మీయులను పలకరిద్దామని చూస్తే సిగ్నల్ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో అయితే సిగ్నల్ కోసం Read more