हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం

sumalatha chinthakayala
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు.ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం.

హాజరైన ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్

ప్ర‌మాణం చేయించిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా

ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం,

ఎన్నికల్లో రేఖా గుప్తాకు 68,200 ఓట్లు

కాగా, రేఖా గుప్తా తొలిసారి పోటీ చేసినప్పుడు 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తరువాత రేఖాగుప్తా ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేఖా గుప్తా తన ప్రత్యర్థి వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38,605 ఓట్లు వచ్చాయి. రేఖా గుప్తాకు 68,200 ఓట్లు దక్కాయి.

రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం
రేఖా గుప్తా రాజకీయం ఉపాధ్యాయ వృత్తితో మొదలైంది. 2017లో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ కార్పొరేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ క్రమంగా ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతగా ఎదిగారు. మహిళా విభాగంలో కీలక భాద్యతలు నిర్వహించిన రేఖా గుప్తా, పార్టీ కార్యాచరణను మరింత బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించారు.

ప్రధాని మోడీ ప్రసంగం
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆవిర్భవించడం ప్రజాస్వామ్య విజయం అని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిస్వార్థ సేవ అందించేందుకు కొత్త ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించారు. కొత్త ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి తొలి నిర్ణయాలు
ప్రమాణ స్వీకారం అనంతరం రేఖా గుప్తా తన తొలి నిర్ణయాలను ప్రకటించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలకు ప్రాథమిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. పేదల కోసం కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

విపక్షాల స్పందన
ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న ఆప్ నేతలు ఈ విజయాన్ని తాత్కాలికమని అభివర్ణించారు. ప్రజా సమస్యల పరిష్కారం లోపిస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వారన్నారు. రేఖా గుప్తా ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవలు అందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870