- సత్యవర్ధన్‌ను వంశీ తన అనుచరులతో కలిసి కిడ్నాప్
- వంశీ అక్రమ పనులకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదు – మంత్రి కొల్లు రవీంద్ర
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సంచలన ఆరోపణలు చేశారు. వంశీ తనపై అక్రమ కేసులు పెట్టారని చెబుతుండగా, టీడీపీ నేతలు దీనికి సమాధానంగా అతని దుష్టచర్యలను బయటపెట్టారు. సత్యవర్ధన్‌ను వంశీ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసిన సీసీటీవీ ఫుటేజీని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో వంశీ అనుచరులతో కలిసి సత్యవర్ధన్‌ను లిఫ్ట్‌లో తీసుకెళ్తూ భయాందోళనకు గురి చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ నిదర్శనాలతో వంశీ తప్పించుకునే మార్గమే లేకుండా పోయిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

వంశీ అక్రమ పనులకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా విస్తరించే ప్రయత్నం చేస్తే సహించబోమని స్పష్టంగా తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసును తప్పించుకునేందుకు, బాధితులపై ఒత్తిడి తెచ్చేందుకు వంశీ కిడ్నాప్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. టీడీపీ విడుదల చేసిన వీడియోలో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ వివాదం అసలు ములవ్వి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో మొదలైంది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ ఈ దాడిపై ఫిర్యాదు చేయడంతో, వంశీ అతన్ని బెదిరించి తనకు అనుకూలంగా అఫిడవిట్ ఇప్పించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, సత్యవర్ధన్ ధైర్యం చేసి వాస్తవాలను బయటపెట్టడంతో వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది.
???? The Real Truth Bomb ???? ????????????????????
దళిత యువకుడు సత్యవర్ధన్ ను విజయవాడలో కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిగో ఈ సీసీ ఫుటేజీ సాక్ష్యం. ఇప్పుడు చెప్పు జగన్ నీ… pic.twitter.com/IQTlrREbpy— Telugu Desam Party (@JaiTDP) February 18, 2025