हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు – కేటీఆర్

Sudheer
రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు – కేటీఆర్

  • హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి
  • రేవంత్ పాలన పూర్తిగా విఫలం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో రైతులకు రూ.10,000 రైతుబంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రూ.15,000 అందిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు రూ.12,000 మాత్రమే అంటున్నారు. అసలు ఆ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు అందించలేకపోయారు” అని కేటీఆర్ విమర్శించారు.

ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ

అంతేకాదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని తిట్టనంతగా రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, ఆయన పాలన పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని కేటీఆర్ ఆరోపించారు. “తులం బంగారం ఇవ్వడం కాదు, మహిళల మెడలో ఉన్న పుస్తెలతాడు కూడా తీసుకెళ్తాడనే పరిస్థితి వచ్చింది” అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని, త్వరలోనే తెలంగాణలో మార్పు అనివార్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉధృతతను తెచ్చాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870