FASTag new rules from today

FASTag : నేటి నుంచి కొత్త రూల్స్.. లేటైతే రెట్టింపు బాదుడు

మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి..లేదంటే ఇబ్బందులు

న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఫాస్టాగ్ బ్యాలెన్సు ధ్రువీకరణకు సంబంధించి రెండు ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ రెండు విషయాలను వాహనదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే టోల్ ప్లాజాల వద్ద ఎర్రర్ కోడ్ 176 చూపే పరిస్థితి వస్తుంది. ఇది ఫాస్టాగ్ ద్వారా మీ టోల్ చెల్లింపులను తిరస్కరణకు దారి తీస్తుంది. ఒక్కోసారి రెండింతలు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

Advertisements
 నేటి నుంచి కొత్త రూల్స్

కొత్త రూల్స్ ఇవే..

ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి జనవరి 28, 2025 రోజున నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం.. రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు టోల్ ప్లాజా వద్ద రీడర్ చదివే సమయం, తక్కువ బ్యాలెన్స్ లేదా బ్లాక్ లిస్ట్ కింద ట్యాగ్ ఉంచబడిన సమయం ఆధారంగా ధ్రువీకరించనున్నారు. రీడర్ రీడ్ టైమ్‌కు 60 నిమిషాల ముందు వరకు, రీడర్ రీడ్ టైమ్ తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్‌గా లేని ట్యాగ్‌లపై రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు రీజన్ కోడ్ 176తో తిరస్కరించబడతాయి. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచే అమలులోకి వస్తాయి.

కేవైసీ అప్డేషన్ పెండింగ్‌

రెండు రకాల వెహికల్స్ ఉంటాయి. వైట్ లిస్టెడ్ వెహికల్స్, బ్లాక్ లిస్టెడ్ వెహికల్స్. తక్కువ బ్యాలెన్స్ ఉండడం, కేవైసీ అప్డేషన్ పెండింగ్‌లో ఉండడం, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ సరిపోలకపోవడం వంటి కారణాలతో బ్లాక్ లిస్టులో పెడతారు. ఫాస్టాగ్ బ్లాక్‌ లిస్టులో పడితే వాహనదారులకు 70 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వినియోగదారు టోల్ ప్లాజా వద్దకు వచ్చినప్పుడు 60 నిమిషాలకు పైగా హాట్ లిస్ట్ లేదా మినహాయింపు జాబితాలో ట్యాగ్ ఉండి, వెళ్లిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు లిస్టులో ఉండిపోయినప్పుడు మాత్రమే ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్ తిరస్కరించబడుతుంది. లేకపోతే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది.

Related Posts
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు Read more

Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన
Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన అమానుష ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనను దుర్వినియోగానికి గురిచేశారని ఓ న్యాయవాది Read more

21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, Read more

చంద్రబాబు ట్వీట్తో తెలుగు-తమిళుల మధ్య మాటల యుద్ధం!
CBN tweet viral

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు విజయాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ట్వీట్లో గుకేశ్ తెలుగువాడని పేర్కొనడంపై తమిళ నెటిజన్లు Read more

×