Small relief for AAP.. CM Atishi's win

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే: ఆతిశీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పార్టీ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ సహా కీలక నేతలైన మనీశ్‌ సిసోడియా, సత్యేంద్రజైన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌ ఓటమి పాలయ్యారు. కీలక నేతల్లో సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

Advertisements
image

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే అని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. కానీ సెలబ్రేట్‌ చేసుకునే సమయం కాదు. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమాద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 23 స్థానాల్లో ఆప్‌ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.

Related Posts
Kavitha : పసుపు రైతుల‌కు 15 వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వండి: క‌విత
Give turmeric farmers a minimum support price of Rs 15,000: Kavitha

Kavitha: ప‌సుపు రైతుల‌కు రూ.15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్ల‌కార్డుల‌తో Read more

రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్ కు టెండర్లు – ఏపీ సర్కార్
amaravati buildings

అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులు కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కసరత్తు ప్రారంభించింది. Read more

రాజారెడ్డి ఐ సెంటర్ న్ను ప్రారంభించిన జగన్
Raja Reddy Eye Center

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించారు. Read more

అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
indian money

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. జీఎస్టీలో కీలక మార్పులుజీఎస్టీ Read more

×