Small relief for AAP.. CM Atishi's win

ఆప్‌కి స్వల్ప ఊరట..సీఎం అతిశీ గెలుపు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్‎లో చివరి వరకు వెనుకంజలో ఉన్న ఢిల్లీ సీఎం అతిశీ.. అనూహ్యంగా లాస్ట్ రౌండ్‎లో పుంజుకుని విజయం సాధించింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతిశీ.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందింది. కల్కాజీ ఎన్నిక ఫలితం చాలా ఇంట్రెస్టింగ్‎గా సాగింది. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి పూర్తి అధిపత్యం కనబరుస్తూ వచ్చారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి సీఎం అతిశీ స్వల్ప అధిక్యం దక్కించుకున్నారు తప్పితే.. రమేష్ బిధూరినే లీడ్‎లో కొనసాగారు.

Advertisements
image

దీంతో కల్కాజీలో సీఎం అతిశీ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ.. చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకున్న అతిశీ.. బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆప్ అగ్రనేతలు ఎన్నికల్లో ఓటమి పాలవగా.. అతిశీ అనూహ్య విజయం సాధించారు. ఇక, 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆప్ వరుస విజయాలకు బ్రేకులు వేసిన కాషాయ పార్టీ.. హస్తినా పీఠం దక్కించుకుంది.

కాగా, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి అతిశీ ఈ స్థానాన్ని 11,393 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. ఆమెకు 52.28శాతం ఓట్ల వాటాతో 55,897 ఓట్లు వచ్చాయి. అతిశీ ప్ర‌త్య‌ర్థి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌కు 41.63 శాతం అంటే 44,504 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శివానీ చోప్రా కేవలం 4,965 ఓట్లతో (4.64శాతం) మూడవ స్థానంలో నిలిచారు.

Related Posts
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
Polling for MLC election tomorrow

రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ Read more

ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం ?
Is Israel ready to attack Iran?

మద్దతు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరినట్లు వెల్లడి జెరూసలేం : ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి Read more

కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే
Field survey from today

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురావడం Read more

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. Read more

×